»   » అమ్మ కడుపు కోతకు కారణమయిన వాన్ని కఠినంగా శిక్షించాలి

అమ్మ కడుపు కోతకు కారణమయిన వాన్ని కఠినంగా శిక్షించాలి

Subscribe to Filmibeat Telugu

దివంగత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని మైఖేల్ తల్లి క్యాథరీన్ డిమాండ్ చేసింది. మైఖేల్ జాక్సన్ చనిపోయిన రోజు అతని వ్యక్తిగత డాక్టర్ ముర్రే అతన్ని బ్రతికించడానికి అత్యవసర పరిస్థితుల్లో కాల్ చెయ్యాల్సిన 911కు వెంటనే ఫోన్ చెయ్యకుండా ఆలస్యం చెయ్యడమే కాకుండా అతన్ని చంపేయాడానికే CPR ను మధ్యలో ఆపేసి అక్కడున్న మందులు ఎవ్వరికీ దొరకకుండా తన బ్యాగులో వేసుకోవడంలో నిమగ్నం అయ్యాడనే వార్త రావడంతో ఆమె ఇలా వ్యాఖ్యానించారు.

అసలు ముర్రే ఇలాచేసాడంటే నమ్మబుద్ది కావడం లేదని కానీ ఆధారాలతో సహా అతని అసలు స్వరూపం బయటపడటంతో చాలా బాధగా, కోపంగా వుందని అతన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇక మైఖేల్ జాక్సన్ గత ఏడాది జూన్ 25న అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అతనికి మోతాదుకు మించి ప్రొపొఫోల్ డ్రగ్ ఇవ్వడంతో మరణించాడని పోస్ట్ మార్ట్ రిపోర్ట్ లో నిర్ధారణ అయింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు డా.ముర్రే ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించాడని నిర్ధారణ అయింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu