»   » మానసికంగా కుంగిపోయా, తప్పుచేసాను: సంవత్సరం తర్వాత నోరు విప్పిన మోడల్

మానసికంగా కుంగిపోయా, తప్పుచేసాను: సంవత్సరం తర్వాత నోరు విప్పిన మోడల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ, టీవీ నటి కెండాల్ జెన్నర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ యేడాది మొదట్లో ఆమె చేసిన ఓ డ్రింక్‌ యాడ్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ యాడ్ విషయం లో తాను చేసింది పొరపాటేనంటూ ఇప్పుడు క్షమాపణ చెప్పింది.

ఉద్యమాన్ని కించపరిచేలా

ఉద్యమాన్ని కించపరిచేలా

ప్రముఖ శీతలపానీయ సంస్థ పెప్సీ రూపొందించిన యాడ్ లో కెందాల్ నటించింది. అయితే నల్లజాతి ఉద్యమాన్ని కించపరిచేలా ఉందంటూ ఆ సమయంలో విమర్శలు వినిపించాయి. దీంతో క్షమాపణలు తెలియజేసిన పెప్సీ సంస్థ ఆ యాడ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కెందాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ద్వారా యాడ్ పై స్పందించింది.

పెద్ద తప్పు చేశా

పెద్ద తప్పు చేశా

‘ఆ యాడ్ చేసి చాలా పెద్ద తప్పు చేశా. విమర్శల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయా. నా జీవితం ముగిసిందనే భావించా. కానీ, పరిస్థితి ఇప్పుడు సర్దుమణిగింది. మళ్లీ మాములు జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యా అని 21 ఏళ్ల కెందాల్ తన పోరపాటుకు చింతిస్తున్నట్టు తెలిపింది.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్

బ్లాక్ లైవ్స్ మ్యాటర్

నల్లజాతి యువతీయువకులపై జరుగుతున్న దాడులు, హత్యలకు నిరసనగా గత సంవత్సరం జూలైలో అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనల్లో అనేక నినాదాలతో పాటు, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అన్న నినాదం ప్రత్యేకంగా కనిపించింది.

ఉధ్యమాన్ని ఈ ఆడ్ కోసం

ఉధ్యమాన్ని ఈ ఆడ్ కోసం

నిజానికి అది నినాదం కాదు, సంస్థ పేరు. ఇటీవలి కాలంలో విస్తృతంగా కొనసాగుతున్న పోలీసు హత్యలను నిరసిస్తూ అమెరికాలో వెల్లువెత్తిన ఉద్యమాలు గత అనుభవాలనుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. అమెరికాలోని నల్లజాతి హక్కుల ఉద్యమకారులు ఈ ఉద్యమంలో సోషల్ మీడియాను చాలా శక్తిమంతంగా ఉపయోగించుకున్నారు.ఆ ఉధ్యమాన్ని ఈ ఆడ్ కోసం వాడుకున్నారు.

పెప్సీ టిన్‌లను ఇచ్చి

పెప్సీ టిన్‌లను ఇచ్చి

యాడ్ విషయానికొస్తే.. బ్లాక్ లైవ్స్ పేరిట కొందరు ఆందోళనకారులు ర్యాలీ చేస్తుండగా, అక్కడున్న పోలీసులు అడ్డుకుంటారు. పక్కనే ఫోటో షూట్ చేస్తున్న కెందాల్ ఇది గమనించి పెప్సీ టిన్‌లను ఇచ్చి పోలీసులను ఛిల్‌ చేస్తుంది. చూడటానికి బాగానే ఉన్నా తమ హక్కుల కోసం చేసిన పోరాటాన్ని పెప్సీ తో సాధించినట్టు, పోలీసులని ఎదుర్కునే క్రమం లో తమ వేదనని అవమానించినట్టూ అనిపించటంతో ఒకసామాజిక పోరాటాన్ని అవహేళన చేశారంటూ రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి.

కిమ్ కర్దాషియాన్‌ సోదరి

కిమ్ కర్దాషియాన్‌ సోదరి

కెండాల్ జెన్నర్ గురించి ఇతర విషయాల్లోకి వెళితే నవంబర్ 3, 1995లో జన్మించింది. లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. కిమ్ కర్దాషియాన్‌ సోదరి. తన సిస్టర్స్‌తో కలిసి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తన వస్త్ర ధారణ విషయం లో కెందాల్ తన సోదరికన్నా ఎక్కువ విమర్శలనీ, అభిమానులనీ సంపాదించుకుంది.

English summary
Model kendall jenner feeling Sorry and reacts on Pepsi Controvercial ad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X