50 సంవత్సరాల నాటి అరుదైన 'మన్రో' నగ్న చిత్రం
లండన్, జూన్ 4: 50 సంవత్సరాల క్రితం హాలీవుడ్ లెజెండ్ మార్లిన్ మన్రో నగ్నంగా నటించిన ఫోటోషూట్ సంబంధించిన ఇమేజిలు ఇప్పడు భూమి మీద హాల్ చల్ చేస్తున్నాయి. మే 23, 1962వ సంవత్సరంలో ఫాక్స్ ఫిల్మ్ స్టూడియోస్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద మార్లిన్ మన్రో నటించిన సినిమా 'సమ్‌థింగ్ గాట్ టు గివ్' షూటింగ్ సెట్‌లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ 'లారెన్స్ షిల్లర్' ఈ ఫోటోలను తీయడం జరిగింది.
75 సంవత్సరాల వయసు కలిగిన ఈ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోషూట్‌పై మాట్లాడుతూ ఈ ఛాయాచిత్రంలో మీరు నిజమైన మార్లిన్ మన్రోని చూడొచ్చు. ఇంకా మిగిలి కొద్దిగా రహస్యం దాగి ఉందని అన్నాడు. ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఈ ఫోటోలలో మార్లిన్ మన్రో ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేని తన శరీరాన్ని చేతులతో కవర్ చేసినట్లు తెలుస్తుంది.
ఫోటోగ్రాఫర్ 'లారెన్స్ షిల్లర్' వద్ద మార్లిన్ మన్రోకు చెందిన ఫోటోల కలెక్షన్ ఉన్నప్పటికీ.. తాను రూపొందిస్తున్న కొత్త పుస్తకం 'మార్లిన్ & మి' కోసం కొన్ని ఫోటోలను ఫైనల్‌కు విడుదల చేశాడు. మార్లిన్ మన్రో ఆగస్టు 1962వ సంవత్సరంలో లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన ఇంట్లో చనిపోయి కనిపించారు. మన్రో ఇంట్లోని బెడ్ దగ్గర స్లీపింగ్ పిల్స్ కనిపించాయి.
36 సంవత్సరాల వయసులో చనిపోయిన మార్లిన్ మన్రోది కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు 'డ్రగ్' ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే చనిపోయిందని అధికారికంగా ధృవీకరించారు.


Click it and Unblock the Notifications











