twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవంబరు 13న రాబోతున్న ప్రళయం..!!

    By Kuladeep
    |

    ఏన్నో రోజులుగా ఊరిస్తున్న హాలీవుడ్ సినిమా 2012 ఎట్టకేలకు ఈ నెల 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. రొనాల్డ్ ఎమ్రిచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రొనాల్డ్ ఎమ్రిచ్, మార్క్ గోర్డాన్, హెరాల్డ్ క్లోసర్, ల్యారీ జె. ప్రాంకో, యూటే ఎమ్రిచ్ లు నిర్మాతలు. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మక కొలంబియా పిక్చర్స్ పంపినీ చేస్తోంది.

    కథ విషయానికి వస్తే ఇది 2012లో రాబోవు ప్రళయం ఇతివృత్తంగా తెరకెక్కిన కథ అని దర్శకనిర్మాతలు చెప్పారు. మాయన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 21, 2012 న ఈ యుగం అంతం కానుందట. దీన్నే కథాంశంగా ఎన్నుకొని రూపొందించిన సినమా ఇది. ఇప్పటికే విడుదలయిన ట్రెయిలర్లు అద్భుతంగా వున్నాయని వినిపిస్తోంది. 158 నిమిషాల వ్యవధి గల ఈ సినిమా 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ లో రూపొందించారు. 2008, ఆగస్టు నెలలో ప్రారంభమయిన ఈ సినిమాని తొలుత జులై 10, 2009 న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ వేసవిలో వచ్చే వరుస సినిమాల మధ్యలో తమ సినిమా కొట్టుకొని పోకూడదని నవంబర్ 13కు వాయిదా వేశారు.

    కాగా ఈ సినిమా గురించి ఎన్నో వివాదాలు రేగాయి. అసలు 2012 కు కలియుగం అంతం అవుతుంది అనడం హాస్యాస్పదం అని, సినిమా ప్రమోషన్ కోసమే నిర్మాతలు అలాంటి ప్రచారాలకు పూనుకున్నారని శాస్త్రవేత్తలు ద్వజమెత్తారు. ఈ వివాదాలన్నీ అటుంచితే 2012 లో ప్రళయం వస్తుందో రాదో తెలియదు కానీ ఈ సినిమా విడుదలయ్యాక థియేటర్లలో కలెక్షన్ల ప్రళయం సృష్టిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X