twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులు, దర్శకనిర్మాతలే ఆమె ప్రాణాలు తీసారు..!!

    By Kuladeep
    |

    'క్లూలెస్' తార బ్రిటానీ ముర్ఫి మరణానికి మితిమీరిన డ్రగ్సే కారణమణి డాక్టర్లు నిర్ధారించారు. తన ముఖాకృతిని మార్చుకోవడం కోసం ఆమె ఎన్నో ప్లాస్టిక్ సర్జరీల కత్తి గాట్లను ఎదుర్కొన్నారు. ఈ బాధనుండీ విముక్తి కోసం ఆమె వాడిన డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనవి. ప్రముఖ పాప్ సింగర్ మైఖేవ్ జాక్సన్ ఈ తరహా డ్రగ్స్ వల్లే ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను ఆమె మితిమీరిన మోతాదులో వాడటంతో ఆమె మరణించిందని డాక్టర్లు నివేదికను ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

    దీనిపై స్పందించిన ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన 'క్లూలెస్' సినిమా దర్శకురాలు ఆమీ హెక్కర్లింగ్ అసలు ఆమె మరణానికి ప్రధాన కారణం హాలీవుడ్డే అని ఆవేదన వ్యక్తం చేసారు. హాలీవుడ్ కు వచ్చిన కొత్తలో గుండ్రని ముఖాకృతిలో చూడటానికి ముచ్చటగా వున్న బ్రిటానీ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె నటనా ప్రతిభను కూడా ఎవరూ గుర్తించలేక పోయారు.

    దీంతో ఆమె ప్లాస్టిక్ సర్జరీల ద్వారా ముఖాన్ని మార్చుకుంటే ఉన్నట్టుండి పెద్ద అందగత్తె భువి నుండీ దివికి దిగొచ్చినట్టు నానా హైరానా చేసారు. ఏ ప్రముఖ వార పత్రిక మీద చూసినా ఆమే దర్శనమిచ్చేది. దీంతో ఆమెకు అభిమానులు పెరిగిపోయారు. ఆ తర్వత ఆమె తన అభిమానులను సంతృప్తి పరచడానికి మరిన్ని కత్తి గాట్లను ఓర్చుకుని తన ముఖాన్ని మార్చుకుంది, తను ఇలాంటి శరీరాకృతి లోనే ఉండాలనే ఒత్తిడి ఆమెలో పెరిగిపోయింది. కానీ అవి తన ప్రాణాలను తీస్తాయని ఆమె ఊహించలేకపోయింది.

    ముచ్చటైన ఈ అమ్మాయిని ఇప్పుడిలా నిర్జీవంగా పడివుండేలా చేసిన పాపం మాత్రం ఆమె అభిమానులు మరియు హాలీవుడ్ దే అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. అందమైన జీవితం కోసం ఎన్ని కష్టాలైనా పడండి కానీ అందం కోసం జీవించకండి అని ఆమె సలహా ఇస్తున్నారు. కాగా గత ఆదివారం ఉజయం 10 గంటలకు మరణించిన బ్రిటానీ అంత్యక్రియలు గురువారం జరగవచ్చని విశ్వసనీయ సమాచారం.

    గమనిక: మీరిక్కడ చూస్తున్న చిత్రం లో ఆమె పూర్వపు ముఖాకృతి, ప్లాస్టిక్ సర్జరీ తర్వాతి మఖాకృతికి మధ్య తేడాను స్పష్టంగా గమనించవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X