»   » ప్రపంచం మొత్తం అభిమానులున్న ఆమె పాత్ర చేయాలంటే దమ్ముండాలి

ప్రపంచం మొత్తం అభిమానులున్న ఆమె పాత్ర చేయాలంటే దమ్ముండాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికా సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు మార్లిన్ మన్రో. అమె చనిపోయిన తర్వాత కూడా అమె పేరు చరిత్రలో అలా నిలచిపోయింది. ఇప్పుడు హాలీవుడ్‌లో గత కొంతకాలంగా మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈప్రయత్నంలో భాగంగా ఈపాత్రకు నోమి వాట్స్ త్వరలో నటించనుందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఐతే నోమి వాట్స్ మాత్రం ఈవిషయంపై మట్లాడుతూ మార్లిన్ మన్రో పాత్ర చేయాలంటే నాకు చాలా భయంగా ఉందని తన మనసులోని భావాలను పంచుకున్నారు.

మార్లిన్ మన్రో పాత్రలో ఇమిడిపోయి నటించాలంటే చాలా ధైర్యంకావాలని అన్నారు. దీనికి కారణం ప్రపంచం మొత్తం మీద మార్లిన్ మన్రో అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా మార్లిన్ మన్రో స్టయిల్‌ని కూడా ఇమిటేట్ చేయాలంట్ చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. నోమివాట్స్‌తో పాటుగా మిచెల్లీ విలియమ్స్ కూడూ ఈసినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించనున్నారు. ఈసినిమాలో మిచెల్లీ విలియమ్స్ చేసేటటువంటి అద్బుతమైన రోల్ మై వీక్ విత్ మార్లిన్ అంటూ మార్లిన్ మన్రో గురించి తన అనుభవాలను మనతో పంచుకుంటారన్నమాట.

English summary
Naomi Watts has revealed that she’s extremely scared about playing Marilyn Monroe in a new biopic. The actress is set to play the iconic screen siren in an adaptation of Andrew Dominik's ''Blonde'' and she admitted the nerves about the part are getting to her. "It's a huge pressure. We all feel we know her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu