twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హాలీవుడ్ చిత్రం స్పూర్తితోనే నక్సల్స్‌కు దాడి

    By Srikanya
    |

    రాయ్‌పూర్‌: సినిమాలనుంచి వ్యక్తులే కాదు...సమూహాలు కూడా ప్రేరణ పొందుతాయని,హింసకి పాల్పడే అవకాసమందని రిపోర్టులు తేలుస్తున్నాయి. నక్సలైట్‌లు హాలీవుడ్‌ యాక్షన్‌, యుద్ధ సినిమాలనుంచి స్ఫూర్తిని పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతదేహంలో నక్సలైట్‌లు పేలుడు పదార్ధాన్ని అమర్చిన విషయం తెలిసిందే. ఇది ఆస్కార్‌ అవార్డ్‌ గెలుచుకున్న 2008 సంవత్సరంనాటి యుద్ధ సినిమా హర్ట్‌లాకర్‌లో అనుసరించిన ఎత్తుగడ కావటం విశేషం.

    ఛత్తీస్‌గడ్‌ పోలీసులు ఇటీవల బీజాపూర్‌ జిల్లాలో ఒక నక్సల్‌ శిక్షణా శిబిరంనుంచి పలు సీడి ప్లేయర్‌లను, హాలీవుడ్‌ సినిమాల సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సినిమాలన్నీ కమేండో శిక్షణ, బాంబ్‌ల తయారీ, యుద్ధతంత్రాల ఇతివృత్తాలవే కావడం గమనార్హం. పిడియా గ్రామ అడవులలో ఒక నక్సల్‌ శిక్షణా శిబిరాన్ని పట్టుకున్నపుడు 8 హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాల సీడీలు దొరికాయని ఛత్తీస్‌గడ్‌ రాష్ట్ర అదనపు డీజీపీ ఆర్‌కే విజ్‌ చెప్పారు.

    ఆ సీడీలలో బిహైండ్‌ ఎనిమీ లైన్స్‌, డెల్టా ఫోర్స్‌, డైహార్డ్‌, మ్యాట్రిక్స్‌, గాడ్స్‌ మస్ట్‌బి క్రేజీ వంటి సినిమాలు ఉన్నాయని తెలిపారు. ప్రాధమిక సాక్ష్యాధారాలనుబట్టి గిరిజనులకు శిక్షణ ఇవ్వడానికి నక్సలైట్‌లు సీడీలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. భద్రతాదళాలు తీసుకుంటున్న చర్యలతో నక్సలైట్‌లకు శిక్షణాశిబిరాలను నిర్వహించడం కష్టమయిందని, అందుకే వారు యాక్షన్‌ సినిమాల సహాయం తీసుకుంటున్నట్లనిపిస్తోందని అన్నారు.

    దాడి వ్యూహాలను నేర్చుకోడానికి, అత్యాధునిక ఆయుధాల పరిజ్ఞానాన్ని తెలుసుకోడానికి గత కొన్నేళ్ళుగా నక్సలైట్‌లు హాలీవుడ్‌ సినిమాలను ఉపయోగిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి ఒకరు చెప్పారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అని వారు ఆందోళన వ్యక్తం చేసారు.

    English summary
    Recently, a CRPF jawan's body was found with an explosive device surgically implanted inside. Authorities said that this tactic was straight out of the Oscar-winning war film 'Hurt Locker' (2008). Chhattisgarh police recently recovered CD players and CDs of Hollywood movies from a Naxal training camp in Bijapur district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X