»   » డేనియల్ గ్రెగ్ మూడవ సారి సీక్రెట్ ఏజెంట్ గా ఈ జేమ్స్ బాండ్ సినిమాలో

డేనియల్ గ్రెగ్ మూడవ సారి సీక్రెట్ ఏజెంట్ గా ఈ జేమ్స్ బాండ్ సినిమాలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీక్రెట్ ఏజెంట్ అనగానే జేమ్స్ బాండ్ అనే లాగా మన మనసుల్లో పాతుకుపోయేలాగా చేశారు ఇంగ్లీషు వాళ్శు. దీనికి పూర్తి సార్దకత చేకూర్చే విధంగానే జేమ్స్ బాండ్ సాహాసాలు ఉంటాయనేది నిజం. అలాంటి జేమ్స్ బాండ్ సినిమాని త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫిల్మ్ స్టూడియో యమ్ జి యమ్, ఇవోఎన్ ప్రోడక్షన్ ఎగ్జిగ్యూటివ్స్ ఇటీవల మాట్లాడుతూ డేనియల్ గ్రెగ్ జేమ్స్ బాండ్ గా 23వ జేమ్స్ బాండ్ సినిమా ఈసంవత్సరం లో మొదలు పెట్టనున్నామని, నవంబర్ 9, 2012 లో కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకోని సినిమాని విడుదల చేయనున్నామని తెలిపారు.

డేనియల్ గ్రెగ్ మూడవ సారి సీక్రెట్ ఏజెంట్ గా ఈ జేమ్స్ బాండ్ సినిమాలో నటించనున్నారు. ఆస్కార్ విన్నర్ శామ్ మెండిస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, స్కీన్ ప్లే మొదలగు విభాగాలను నీల్ పుర్వెస్, రాబర్ట్ వాడే, జాన్ లాగన్ చూసుకోనున్నారు. గతంలో జేమ్స్ బాండ్ సినిమాలు తీసేటటువంటి ప్రాంచైజి కొంచెం పైనాన్సియల్ ట్రబుల్స్ ఉండగా, వారికి పైనాన్సియల్ గా సహాయం అందివ్వడానికి మరికొన్ని సంస్దలు ముందుకు రావడంతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు.

లెక్కప్రకారం 23వ జేమ్స్ బాండ్ సినిమా ఏప్రిల్ 2010లో విడుదల కావాల్సి ఉండగా, విడుదల కాలేక పోవడానికి కారణం పైనాన్సియల్ ట్రబుల్స్ ఉండడమే అంటున్నారు. దానికి కారణం ఫిల్మ్ ఇండస్ట్రీలో జేమ్స్ బాండ్ కు ఉన్నటువంటి క్రేజీ అలాంటిది. 2008వ సంవత్సరంలో వచ్చినటువంటి క్వాంటమ్ ఆఫ్ సోలెస్ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత జేమ్స్ బాండ్ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని బట్టి ఈసారి తీయబోయే జేమ్స్ బాండ్ సినిమా ఓ పెద్ద సంచలనం సృష్టించడానికి మీముందుకు వస్తుందని తెలిపారు.

English summary
There is exciting news for James Bond fans - a new 007 film has officially been announced. Film studio MGM and EON Productions executives have announced that the 23rd James Bond film will begin production later this year, and be released worldwide on November 9, 2012.
 Daniel Craig is back for his third turn as the secret agent, while Oscar winner Sam Mendes will direct a screenplay written by Neal Purvis, Robert Wade and John Logan, reports the BBC.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu