»   » మళ్లీ స్కూల్‌కు : 'స్పైడర్‌ మాన్‌' సిరీస్‌లో ఇంకోటి

మళ్లీ స్కూల్‌కు : 'స్పైడర్‌ మాన్‌' సిరీస్‌లో ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా 'స్పైడర్‌ మాన్‌' పేరు విననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో కథానాయకుడు చేసే సాహసాలు పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకున్నాయి. 'స్పైడర్‌ మాన్‌' సిరీస్‌లో ఇప్పుడు మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

స్పైడర్‌ మాన్‌గా మారిన హీరోపీటర్‌ పార్కర్‌ హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు చేసిన సాహసాలు గుర్తున్నాయి కదా. ఈ కొత్త చిత్రాన్ని కూడా స్పైడర్‌ మా స్కూల్‌ జీవితం ప్రధానాంశంగా తెరకెక్కించనున్నారు. స్పైడర్‌ మాన్‌ చిత్రాలు నిర్మించే మార్వెల్‌ స్టూడియోస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ ఫీగ్‌ ఈ విషయం తెలిపారు.

New Spider-Man Confirmed As Peter Parker In High School

''హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు స్పైడర్‌ మాన్‌ చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రంలో వాటిని ప్రేక్షకులను మరింత వినోదాన్ని అందించేలా తీర్చిదిద్దుతామ''ని కెవిన్‌ చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలను మరిపించేలా ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది.

English summary
When Spider-Man is introduced in Captain America: Civil War, he will be Peter Parker -- and Peter Parker will be in high school, Marvel's Kevin Feige confirmed during the press tour for Avengers: Age of Ultron.
Please Wait while comments are loading...