For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో నిత్యా మీనన్.. ఫ్రోజెన్ మూవీలో క్రేజీ పాత్రకు డబ్బింగ్

|

హలీవుడ్‌లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫ్రోజెన్ 2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను క్రియేట్ చేస్తున్నది. ఎల్సా పాత్ర ధారిని చూడాలనే కుతూహలం రోజు రోజుకు ప్రేక్షకుల్లో పెరుగుతున్నది. హిందీ డబ్బింగ్ విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా జోనస్, పరిణితి చోప్రా లాంటి గ్లామర్ తారలు ఈ సినిమాతో భాగస్వామ్యం కావడంతో క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాకుండా అత్యంత సాంకేతికతో డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండటం గమనార్హం. అయితే తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నిత్యా మీనన్ భాగస్వామ్యం కావడంతో ఫ్రోజెన్ 2 చిత్రంపై అంచనాలు పెంచింది.

ఫ్రొజెన్ 2 సినిమా కోసం నిత్యమీనన్ తన గొంతును అరువుగా ఇవ్వనున్నారు ఈ సినిమాలోని కీలక పాత్ర ఎల్సాకు డబ్బింగ్ చెప్పనున్నారు. దాంతో యువరాణి ఎల్సా పాత్ర ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ.. ఫ్రోజెన్ 2 సినిమా ఆఫర్ నాకు లభించింది. నాకు నచ్చిన స్క్రిప్టులో ఒకటి కావడంతో వెంటనే ఒప్పుకొన్నాను. సినిమారంగా గొప్ప అనుభూతి కాకుండా.. యువతులకు మంచి స్ఫూర్తిని, హృదయానికి హత్తుకునే సందేశం ఉంది. నాకు ఎల్సా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యాన్స్‌కు, తెలుగు ప్రేక్షకులను నా ప్రతిభతో ఆకట్టుకొంటాను అని తెలిపారు. చిన్నారులందరికీ ఎల్సా పాత్ర స్ఫూర్తిగా నిలుస్తుంది. అందరూ అమితంగా ప్రేమిస్తారు. ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కావడం నా కల సాకారమైందనే ఫీలింగ్ కలుగుతుంది అని పేర్కొన్నారు.

Nithya menen dubbing for Elsa Character in Frozen 2

అత్యంత ప్రతిష్టాత్మకంగా, సాంకేతిక నైపుణ్యంతో రూపొందిన ఫ్రొజెన్ 2 చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం మ్యాజిక్‌ను క్రియేట్ చేసుందుకు సిద్ధమవుతున్నది. అద్భుతమైన కథ, కథనాలతు, హృదయానికి హత్తుకొనే పాత్రలు, తమ సాహస విన్యాసాలతో ప్రేక్షకులను మైమరించే విధంగా ఎల్సా, అన్నా పాత్రలు రూపొదిద్దుకొన్నాయనే మాట వినిపిస్తున్నది.

ఫ్రొజెన్ 2 గురించి

అతీంద్రియ శక్తులతో ఎల్సా ఎందుకు జన్మించింది? తన సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లే క్రమంలో ఆమె ఎలా ఎదురించింది? అన్నా, క్రిస్టాఫ్, ఒలాఫ్, స్వెన్‌తో సాహోసోపేతమైన ప్రయాణం ఎలా సాగింది. ఫ్రోజెన్‌లో తనకు ఉన్న అతీంద్రియ శక్తులు ఎక్కువ అని భావిస్తే.. ఫ్రొజెన్ 2లో తన సత్తాకు సరిపోతాయనే విషయాన్ని అర్థం చేసుకొంటుంది. ఈ సినిమా అకాడమీ అవార్డు విజేతలు డైరెక్టర్లు జెన్నీఫర్ లీ, క్రిస్ బక్, నిర్మాత పీటర్ డెల్ వెచో, పాటల రచయితలు క్రిస్టెన్ అండర్సన్, లోపేజ్, రాబర్ట్ లోపెజ్, డబ్బింగ్ ఆర్టిస్టులు ఇల్దినా మెంజెల్, క్రిస్టిన్ బెల్, జోనాథన్ గ్రోఫ్, జోష్ డాడ్ నుంచి ఈ చిత్రం వస్తున్నది.

అంతేకాకుండా, 2013లో విడుదలైన ఫ్రొజెన్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రంలోని లెట్ ఇట్ గో పాటకు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ఉత్తమ మ్యూజిక్‌కు ఆస్కార్ అవార్డు లభించింది.

బ్యానర్: వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్

మూవీ: ఫ్రోజెన్ 2

ఆంగ్ల డబ్బింగ్: క్రిస్టిన్ బెల్, ఇల్దినా మెంజెల్, జోనాథన్ గ్రోఫ్, జోష్ గాడ్

దర్శకత్వం: క్రిస్ బక్, జెన్నీఫర్ లీ

నిర్మాత: పీటర్ డెల్ వెకో

ఇండియా రిలీజ్ డేట్: 2019 నవంబర్ 22

English summary
Frozen 2 is just a few weeks away from its official release and we can't seem to contain our excitement. From seeing Elsa in an all-new warrior avatar to some of the biggest names such as Priyanka Chopra Jonas and Parineeti Chopra associated with the movie in Hindi, Joining the sisterhood is one of the most-talented actresses seen in the Tollywood industry, Nithya Menen. Nithya is all set to dub for the character of Elsa in Telugu version. Known to be a strong personality in real-life, Nithya is the perfect fit for Elsa, who will be seen as a warrior who doesn't need a prince charming to save her.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more