»   » విడాకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదంటున్న హీరోయిన్..

విడాకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదంటున్న హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంతోకాలంగా విడాకులంటూ ఊగిసులాడుతున్న హాలీవుడ్ అందాల జంట ఇవా లంగోరియా మరియు టోని పార్కర్. టెక్సాస్ లోని బెక్సార్ కోర్టు హౌస్ లోవీరిద్దరూ గతంలో విడాకుల కోసం ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే. 2006వ సంవత్సరంలో ప్రేమించుకున్న ఈజంట ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేసి 2007లో పెళ్శి చేసుకున్నారు. కోన్ని అనివార్యకారణాల వల్ల వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకన్న జంట గతంలో విడాకుల కోసం ప్రయత్నించారు.

దీనిపై స్పందించినటువంటి ఇవా లంగోరియా లాయర్ మాట్లాడుతూ టోని పార్కర్ మాత్రం విడాకులుకు ఇష్టపడకపోవడం వల్ల కారణం చేతగాని, మరలా మరి వాళ్శిద్దరూ ఏమని అనుకున్నారేమోగాని విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈవిషయంపై స్పందించినటువంటి ఇవా లంగోరియా మేమిద్దరం కోన్ని అనివార్యకారణాల వల్ల విడిపోవాలనుకున్న మాట వాస్తవమేనని ఐతే ఇప్పుడు మాత్రం మేమిద్దరం కలసి జీవించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అందుకే మేమిద్దరం విడాకులు తీసుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu