twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ వేడుకల్లో మార్పు... కారణం అదే!

    |

    సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డును చేతుల్లోకి తీసుకోవానే కల అందరూ కంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. ఆస్కార్ అవార్డును గెలవాలని అంరదూ ట్రై చేస్తారు. మన ఇండియన్ సినిమాలు కూడా ఆస్కార్ కోసం బరిలోకి దిగుతాయి. కానీ అక్కడి వరకు చేరలేదు. చివరగా మనకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చిన ఘనత ఏ ఆర్ రెహమాన్‌కు దక్కుతుంది.

    ఒకటి కాదు ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను ఇండియాకు తీసుకొచ్చి చరిత్ర లిఖించాడు. అయితే ఈ ఆస్కార్ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో ఆస్కార్ అవార్డు వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం అలా జరగదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది.

     Oscar 2021 Event will be Held In April

    సినిమా రంగమంతా మూతపడింది. ఎన్నో చిత్రాలు ఇంకా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇంకా ఏవైనా చిత్రాలు ఎంట్రీలోకి వస్తాయా? అని చూసేందుకు ఆస్కార్ వేడుకలను వాయిదా వేసి ఏప్రిల్‌లో జరుపనున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు కరోనా కూడా తగ్గే అవకాశం ఉందని అలా ఫిక్స్ చేశారట. ఇక ఈ 93వ ఆస్కార్ అవార్డుల రేసులోకి మన భారత చిత్రం జల్లికట్టు ఎంట్రీ ఇచ్చింది. మరి చివరకు నిలబడి అవార్డును గెలుస్తుందో లేదో చూడాలి.

    English summary
    Oscar 2021 Event will be Held In April, 93rd Academy Awards, or the Oscars 2021 will take place on April 25, 2021 and it will be an in-person event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X