»   » 2017 ఆస్కార్‌ నామినేషన్స్‌ పూర్తి లిస్ట్, ఆ సినిమాకు ఏకంగా 14 నామినేషన్స్

2017 ఆస్కార్‌ నామినేషన్స్‌ పూర్తి లిస్ట్, ఆ సినిమాకు ఏకంగా 14 నామినేషన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజిల్స్‌: ఎప్పటిలాగే ఈ సంవత్సరం( 2017) కూడా ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాలు, నటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను అవార్డుల ఎంపిక కమిటీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్ లు కావటంతో అందరి దృష్టీ వీటిపైనే ఉన్నాయి.

ఇక అవార్డుల ఎంపిక కమిటీ వెల్లడించిన ఈ వివరాల్లో సూపర్ హిట్ మూవీ 'లా లా ల్యాండ్' ఏకంగా 14 నామినేషన్లు దక్కించుకోవటం విశేషం. గతంలో ఈ విధంగా టైటానిక్, ఆల్ అబౌట్ ఈవ్ అనే హాలీవుడ్ సినిమాలు కూడా 14 నామినేషన్లతో దూసుకొచ్చాయి.

Oscar Nominations 2017: 'La La Land' Dominates, 'Moonlight' Shines

హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే టాప్ మూవీ స్థానం కోసం తొమ్మిది సినిమాలు పోటీపడుతున్నాయి. ఉత్తమ నటుడు, నటి, దర్శకత్వ విభాగాల్లో ఐదుగురు చొప్పున పోటీపడుతున్నారు. 89వ అకాడమీ(ఆస్కార్) అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాలు, నటీనటులు, డైరెక్టర్ల వివరాలు..క్రింద చూడండి.

ఉత్తమ చిత్రం
* అరైవల్‌
* ఫెన్సెస్‌
* హాక్సారిడ్జ్‌
* హెల్‌ ఆర్‌ హై వాటర్‌
* హిడెన్‌ ఫిగర్స్‌
* లా లా ల్యాండ్‌
* లయన్‌
* మాంచెస్టర్స్‌ బై ద సీ
* మూన్‌లైట్‌
ఉత్తమ నటుడు
* క్యాసే ఎఫ్లెక్‌ (మాంచెస్టర్స్‌ బై ద సీ)
* ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ (హక్సా రిడ్జ్‌)
* రియాన్‌ గోస్లింగ్‌ (లా లా ల్యాండ్‌)
* విగ్గో మార్టెన్‌సన్‌ (కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌)
* డెన్జిల్‌ వాషింగ్టన్‌ (ఫెన్సెస్‌)
ఉత్తమ నటి
* ఇసబెల్లా హపర్ట్‌ (ఎల్లీ)
* రూత్‌ నెగ్గా (లవింగ్‌)
* నటైలీ పోర్ట్‌మ్యాన్‌ (జాకీ)
* ఎమ్మా స్టోన్‌ (లా లా ల్యాండ్‌)
* మెర్లే స్ట్రీప్‌ (ఫ్లోరెన్సీ ఫోస్టర్‌ జెన్కిన్స్‌)
ఉత్తమ దర్శకుడు
* డెనిస్‌ విల్లేనెవ్యూస్‌ (అరైవల్‌)
* మెల్‌గిబ్సన్‌ (హాక్సా రిడ్జ్‌)
* డామియన్‌ చజెల్లీ (లా లా ల్యాండ్‌)
* కెన్నత్‌ లోనర్గాన్‌ (మాంచెస్టర్స్‌ బై ద సీ)
* బారీ జెన్కిన్స్‌ (మూన్‌లైట్‌)

Oscar Nominations 2017: 'La La Land' Dominates, 'Moonlight' Shines

రీసెంట్ గా...హాలీవుడ్ మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీ 'లా లా ల్యాండ్' గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో దుమ్మురేపింది. ఏడు క్యాట‌గిరీల్లో నామినేట్ అయిన 'లా లా ల్యాండ్' మొత్తం ఏడు అవార్డుల‌నూ గెలుచుకుంది. ఉత్త‌మ చిత్రం అవార్డు కూడా ఈ చిత్రాన్నే వ‌రించింది.

ఈ ఫిల్మ్‌లో నటించిన ఎమ్మా స్టోన్‌, ర్యాన్ గోస్లింగ్ కూడా అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ డైర‌క్ట‌ర్‌, స్క్రీన్ ప్లే, మ్యూజిక్‌, సాంగ్ అవార్డుల‌ను కూడా 'లా లా ల్యాండ్' ఎగురేసుకుపోయింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ వేడుక‌ల్లోనూ 'లా లా ల్యాండ్' చిత్రం హ‌వా కొన‌సాగించే అవ‌కాశాలున్నాయి. బెస్ట్ డ్రామా క్యాటిరీలో మూన్‌లైట్ చిత్రానికి అవార్డు వ‌చ్చింది.

English summary
When the nominees for the 2017 Academy Awards were announced, La La Land racked up 14 nods, tying records held by Titanic and All About Eve.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu