»   » ఆస్కార్‌ 2015: ఏ హీరో కి ఆస్కారం ఉంది?(ఫొటో ఫీచర్)

ఆస్కార్‌ 2015: ఏ హీరో కి ఆస్కారం ఉంది?(ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ఏంజిల్స్ : ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎదురుచూసే వేడుక మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. జీవితంలో ఒక్కసారైనా అవార్డు ప్రతిమను ముద్దాడాలని తపిస్తుంటారు. ఒకసారి అవార్డు అందుకుంటే మళ్లీ మళ్లీ ఆ వేదికపై నిలబడాలనుకుంటారు. ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల సందడికి రంగం సిద్ధమైంది.

ఈ నెల 22న లాస్‌ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ ఏడాది ఉత్తమ నటుడి పురస్కారం కోసం ఎప్పటిలాగే ఐదుగురు పోటీలో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారి ఈ పురస్కారం కోసం పోటీ పడుతుంటే ఒకరు మూడోసారి పోటీలో ఉన్నారు. వారెవరు, ఏ సినిమా కోసం పోటీలో ఉన్నారో చూద్దాం.

ఆస్కార్‌ వేడుకలో మొత్తం 24 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాల్ని ప్రదానం చేస్తుంటారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల తరవాత ఆ స్థాయిలో ఉత్తమ చిత్రం విభాగం మీదే అందరి ఆసక్తి ఉంటుంది. వాటిలో ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా నిలిచే సినిమా ఏది? ఎలాంటి కథల్ని ఈసారి ఆస్కార్‌కి నామినేట్‌ చేశారు? ఎవరు రూపొందించారు? తదితర విషయాల్ని తెలుసుకుందాం.

ఉత్తమ చిత్రం విభాగం అనేది నిర్మాతల విభాగం. ఏ సినిమాకైతే ఉత్తమ చిత్రంగా పురస్కారం లభిస్తుందో ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఆస్కార్‌ ప్రతిమను ముద్దాడతారు. హాలీవుడ్‌ సినిమాలకు భారీ బడ్జెట్‌ అవసరం ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఒక్కో చిత్రానికి ఇద్దరు.. ముగ్గురు... నలుగురు నిర్మాతలు కూడా ఉండొచ్చు. ఈసారి బరిలో ఉన్న సినిమాల వివరాల్లోకి వెళితే...

స్లైడ్ షోలో... వివరాలు

స్టీవ్‌ కారెల్‌: (ఫాక్స్‌ క్యాచర్‌)

స్టీవ్‌ కారెల్‌: (ఫాక్స్‌ క్యాచర్‌)

నెగిటివ్ (విలన్) ఛాయలున్న పాత్రతో ఆస్కార్‌ ఉత్తమ నటుడు నామినేషన్‌ జాబితాలో నిలిచాడు స్టీవ్‌ కారెల్‌. 'ఫాక్స్‌ క్యాచర్‌'లో జాన్‌ డు పాంట్‌ అనే మిలియనీర్‌ పాత్రలో ఇతడు నటించాడు. ఓ ఒలంపిక్‌ రెజ్లర్‌ను తన ఇంట్లో ఉండి శిక్షణ తీసుకోవడానికి ఆహ్వానిస్తాడు జాన్‌ డు పాంట్‌. దీని వెనుక ఉన్న కారణమే కథ. స్టీవ్‌ కారెల్‌కిది తొలి ఆస్కార్‌ నామినేషన్‌. ఈ చిత్రంలోని నటనకుగాను స్టీవ్‌ కారెల్‌ ఇప్పటికే పలు పురస్కారాలు దక్కించుకున్నాడు. సినిమా కూడా అదే స్థాయిలో అవార్డులు అందుకొంది.

బ్రాడ్లీ కూపర్‌: (అమెరికన్‌ స్నైపర్‌)

బ్రాడ్లీ కూపర్‌: (అమెరికన్‌ స్నైపర్‌)

యుద్ధ భూమిలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న క్రిష్‌ కైల్‌ అనే సైనికుడి జీవితాన్ని ఆవిష్కరించిన 'అమెరికన్‌ స్నైపర్‌'తో ఆస్కార్‌ ఉత్తమ నటుడి పురస్కారాల రేసులో నిలిచాడు బ్రాడ్లీ కూపర్‌. ఈ సినిమా పలు వేదికలపై పురస్కారాలు పొందింది. బ్రాడ్లీ కూపర్‌ కూడా ఉత్తమ నటుడి పురస్కారం పొందాడు. బ్రాడ్లీ గతంలోనూ 'అమెరికన్‌ హసిల్‌' (2013), 'సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లే బుక్‌' (2012) చిత్రాలకు ఉత్తమ నటుడిగా నామినేట్‌ అయ్యాడు. ఈసారి తప్పక పురస్కారం అందుకుంటాడని చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది.

మైఖేల్‌ కీటన్‌: (బర్డ్‌మ్యాన్‌)

మైఖేల్‌ కీటన్‌: (బర్డ్‌మ్యాన్‌)

బర్డ్‌మ్యాన్‌ పాత్రను పోషించి దాని మీద విసుగొచ్చి రచన, దర్శకత్వం వైపు మరలడానికి ప్రయత్నించే ఓ నటుడి పాత్రతో రూపొందిన చిత్రం 'బర్డ్‌మ్యాన్‌' (ది అన్‌ ఎక్స్‌పెక్టెడ్‌ వర్చ్యూ ఆఫ్‌ ఇగ్నోరెన్స్‌). తను అనుకున్నది సాధించడానికి దేనికైనా సిద్ధపడే రిగ్గన్‌ థామ్సన్‌ పాత్రలో మైఖేల్‌ కీటన్‌ కనిపిస్తాడు. అతనికిది తొలిఆస్కార్‌ నామినేషన్‌ కావడం గమనార్హం.

ఎడ్డీ రెడ్‌ మేన్‌: (ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌)

ఎడ్డీ రెడ్‌ మేన్‌: (ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌)

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌'. హాకింగ్‌ పాత్రలో కనిపించాడు ఎడ్డీ రెడ్‌ మేన్‌. మోటార్‌ న్యూరాన్‌ వ్యాధితో బాధపడే వ్యక్తిగా తన పాత్రకు ప్రాణం పోశాడని హాలీవుడ్‌ మీడియా ప్రశంసించింది. ఈ సినిమాలోని నటనకు గాను ఎడ్డీ అనేక పురస్కారాలు అందుకున్నాడు. ఇతనికీ అకాడెమీ పురస్కారాల్లో ఇది తొలి నామినేషన్‌. ఆస్కార్‌ కూడా దక్కుతుందని హాలీవుడ్‌ విమర్శకులు భావిస్తున్నారు.

బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌: (ది ఇమిటేషన్‌ గేమ్‌)

బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌: (ది ఇమిటేషన్‌ గేమ్‌)

బ్రిటన్‌, జర్మనీల మధ్య 1950ల్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆసక్తికరంగా తెరకెక్కిన చిత్రం 'ది ఇమిటేషన్‌ గేమ్‌'. ఈ సినిమాలో ఎలెన్‌ ట్యూరింగ్‌ అనే గణిత శాస్త్ర నిపుణుడిగా బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌ కనిపిస్తాడు. నాజీలను ఇబ్బంది పెట్టేందుకు అతడు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఈ పాత్రలో నటనకుగాను తొలిసారిగా అకాడెమీ పురస్కారం కోసం నామినేట్‌ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా పలు పురస్కార వేదికల్లో నామినేషన్లు పొందింది.

English summary
With the Oscar telecast coming right at us on Feb. 22nd, now's the time to check the odds on the main competition. check out my take on who Will Win and Who Should Win in the whitest Oscar race in years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu