»   »  14 నామినేషన్స్ ‘లా లా ల్యాండ్‌’కు ఎన్ని ఆస్కార్ అవార్డ్ లు వచ్చాయి?

14 నామినేషన్స్ ‘లా లా ల్యాండ్‌’కు ఎన్ని ఆస్కార్ అవార్డ్ లు వచ్చాయి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్‌ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జ‌రిగింది. హలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ, మహారథులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. విభిన్న వస్త్రధారణతో తారలు రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోతూ నడిచి రావడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ నటి ప్రియాంక చోప్రా తనదైన వస్త్రధారణతో తళుక్కున మెరిశారు. ఈ ఆస్కార్ ఉత్సవంలో అందరి దృష్టీ ఒకే చిత్రంపై ఉంది. అది 'లా లా ల్యాండ్‌'.

ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ జరిగినప్పటి నుంచి వార్తల్లో నిలిచిన చిత్రం 'లా లా ల్యాండ్‌'. కేవలం ఈ ఒక్క చిత్రం ఉత్తమ చిత్రం, నటుడు, నటి, దర్శకుడు.. ఇలా పలు విభాగాల్లో 14 నామినేషన్లు దక్కించుకోవటంతో ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఈ సినిమా వైపు చూసింది.. ఆస్కార్‌ చరిత్రలోనే అత్యధిక నామినేషన్లు అందుకున్న చిత్రంగా 'ఆల్‌ అబౌట్‌ ఈవ్‌', 'టైటానిక్‌' చిత్రాల సరసన ఇది నిలిచింది.

14 విభాగాల్లో నామినేట్‌ అయిన ఈ చిత్రం చివరకు 6 అవార్డులు మాత్రమే దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు, నటి, ఒరిజినల్‌ సాంగ్‌, ఒరిజినల్‌ స్కోర్‌, ఛాయాగ్రహణం, ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు సొంతం చేసుకుంది. గతంలో 'ఆల్‌ అబౌట్‌ ఈవ్‌'కు 6, 'టైటానిక్‌'కు 10 ఆస్కార్‌ అవార్డులు దక్కాయి.

నటి కావాలని ఊవిళ్లూరే ఓ యువతి...లాస్‌ఏంజిల్స్‌ చేరుకుంటుంది. సినిమాల్లో చేరే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. కోరుకోగానే సినిమా అవకాశం వస్తుందా...? సినిమా మీద ప్రేమతో షూటింగ్‌ లు జరిగే ఆ ప్రాంతాన్ని కూడా అభిమానిస్తుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో పరిచయం, ప్రేమ మొదలవుతాయి. నటి కావాలన్న లక్ష్యాన్ని యువతి ఎలా చేరిందన్నది ఆసక్తికరం.

ఓ యువ సంగీతకారుడికి, వర్ధమాన నటికి మధ్య జరిగే సంగీతభరిత ప్రేమకావ్యంగా తెరకెక్కిన 'లా లా ల్యాండ్‌' చిత్రాంలో ర్యాన్‌ గోస్లింగ్‌, ఎమ్మా స్టోన్‌ జంటగా నటించారు. డామియెన్‌ చజెల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 30 మిలియన్‌ డాలర్లతో రూపొంది, దాదాపు 300 మిలియన్‌ డాలర్ల వసూళ్లును సాధించింది.

Oscars 2017: La La Land wins 6 awards

నిజానికి 'లా లా'ను నాలుగేళ్లు వద్దన్నారు . అది 2010.. దర్శకుడు డామియన్‌ చాజెల్‌ ఒక స్క్రేన్‌ప్లేను సిద్ధం చేసి పలు స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అప్పటికి డామియన్‌ ఒక మ్యూజిక్‌ వీడియోకు మాత్రమే దర్శకత్వం వహించారు. కానీ ఏ స్టూడియో కూడా ఆ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రాలేదు. ప్రతి చోటా దానిలో కొన్ని మార్పులు చేయాల్సిందేనని చెప్పారు. కానీ డామియన్‌ మాత్రం తనపట్టు వీడలేదు.

2014లో ఆయన దర్శకత్వం వహించిన విప్లిష్‌ అనే చిత్రం విజయం సాధించడంతో హాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. దీంతో సమ్మిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాలా ల్యాండ్‌ నిర్మించేందుకు ముందుకొచ్చింది. దీనిని 2016 ఆగస్టు 31న వెనీస్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 2016 డిసెంబర్‌ 9న అమెరికాలో విడుదల చేశారు. ఇది అక్కడ 369 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ కలెక్షన్‌ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మరో 30 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

ఈ చిత్రం టైటానిక్‌, ఆల్‌ఎబౌట్‌ ఈవ్‌లతో సమానంగా 14 ఆస్కార్‌ నామినేషన్లు సాధించింది. చివరకు ఉత్తమ నటి (ఎమ్మాస్టోన్‌), ఉత్తమ దర్శకుడు(డామియన్‌ చాజెల్‌), ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ ( సిటీ ఆఫ్‌ స్టార్స్‌)కు , ఉత్తమ ఛాయాగ్రహణం( లినస్‌ శాన్‌గ్రేన్‌), ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ ( డేవిడ్‌ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌), ఉత్తమ ఒరిజనల్‌ స్కోర్‌ విభాగాల్లో అవార్డులను సాధించింది.

English summary
The 89th Academy Awards ceremony took place at Los Angeles earlier this morning. La La Land got 14 nominations, including thumbs up for Emma Stone, Ryan Gosling and Damien Chazelle. It bagged the Oscar in 6 of these categories, narrowly missing out on the award for the the best film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu