»   » ఆస్కార్ అవార్డ్స్ 2018 : ఆస్కార్ ఒడిసి పట్టిన విజేతలు, అద్భుత చిత్రాలు ఇవే!

ఆస్కార్ అవార్డ్స్ 2018 : ఆస్కార్ ఒడిసి పట్టిన విజేతలు, అద్భుత చిత్రాలు ఇవే!

Subscribe to Filmibeat Telugu
Oscars 2018 : ఆస్కార్ లో 60 ఏళ్ళ మహిళా ..

చిత్ర పరిశ్రమలో అందజేసే అత్యుత్తమ అవార్డులు ఆస్కార్. ప్రతి నటుడు జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ గెలుపొందాలని కలలు కంటారు. ఆస్కార్ అవార్డు దక్కితే పరవశించిపోతారు. 2018 ఆస్కార్ అవార్డులు అందజేసే తరుణం ఆసన్నమైంది. ఆస్కార్ అవార్డు విజేతల ప్రకటించే కార్యక్రమం మొదలైంది. కొంత మంది అంద్భుత నటులు, అద్భుత చిత్రాలు ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాయి.ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం వివిధ విభాగాల్లో ఆస్కార్ ఆగార్డులు గెలుపొందిన చిత్రాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవార్డుల ప్రక్రియ కొనసాగుతోంది.

అత్యుత్తమ సహాయ నటుడు

అత్యుత్తమ సహాయ నటుడు

అత్యుత్తమ సహాయ నటుడు విభాగంలో ప్రముఖ నటుడు శామ్ రాక్ వెల్ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. 'త్రి బిల్ బోర్డు అవుట్ సైడ్ ఎబ్బింగ్' అనే క్రైం చిత్రానికి గాను ఈ అవార్డు లభించింది.

మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ విభాగంలో

మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ విభాగంలో

మేకప్ మరియు స్టైలింగ్ విభాగంలో 'డార్కెస్ట్ అవర్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి కజుహీరో, డేవిడ్ మాలినీవోస్కి మరియు సిబ్బింక్ స్టైలింగ్ విభాగంలో పనిచేసారు.

కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో

కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో

కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ప్రముఖ కాస్యూమ్ డిజైనర్ మార్క్ బ్రిడ్జెస్ ఆస్కార్ అవార్డు ని కొల్లగొట్టాడు. 'ఫాంటమ్ థ్రెడ్' చిత్రానికి గాను ఈ అవార్డు లభించింది.

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఇకారుస్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది.

సౌండ్ ఎడిటింగ్, మిక్సింగ్

సౌండ్ ఎడిటింగ్, మిక్సింగ్

సౌండ్ ఎడిటింగ్ విభాగంలో 'డన్ కిర్క్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. సౌండ్ మిక్సింగ్ విభాగంలో కూడా ఈ చిత్రమే ఆస్కార్ అవార్డు కొల్లగొట్టడం విశేషం.

ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో

ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో

ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో 'షేప్ ఆఫ్ వాటర్' చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది.

English summary
Oscars 2018 winners list. Oscars 2018 event started.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu