For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శభాష్ బ్రాడ్‌పిట్.. వివాదాలను ఎదురించి.. డ్రగ్స్‌ను వదిలేసి.. ఆస్కార్‌తో మళ్లీ సత్తా

  |
  Rana Daggubati's Comeback In April | Oscars 2020 Winners | Rajamouli Trolls RGV

  ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తొలిసారి యాక్టింగ్ కేటగిరిలో అవార్డును సొంతం చేసుకొన్నాడు. మూడు దశాబ్దాల కెరీర్‌లో గతంలో అస్కార్ అవార్డులు గెలుచుకొన్నప్పటికీ.. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే చిత్రంలో చూపించిన ప్రతిభకు తొలిసారి నటనలో ఆయనకు అవార్డు దక్కడం గమనార్హం. ఇటీవల కాలంలో ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆయన మళ్లీ అవార్డు స్థాయిని నటనను కనబరచడంపై హలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నది. బ్రాడ్ పిట్‌ను వెంటాడిన వివాదాలు ఏమిటంటే..

  స్టంట్ మాస్టర్‌గా

  స్టంట్ మాస్టర్‌గా

  వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే చిత్రంలో బ్రాడ్ పిట్ స్టంట్ మాస్టర్ పాత్రను పోషించారు. ఆయన క్లిఫ్ బూత్, లియనార్డో డికాప్రియోకు బాడీ డబుల్‌గా అద్భుతమైన పాత్రను పోషించారు. తన కెరీర్‌లోనే అత్యంత ఉత్తమ ప్రదర్శనగా సినీ విమర్శకులు పేర్కొన్నారు. అయితే ఈ ఘనతను సాధించడానికి ముందు జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

   ఎంజెలీనాకు విడాకులు

  ఎంజెలీనాకు విడాకులు

  వైవాహిక జీవితంలో భార్య ఎంజెలినా జోలితో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. ఆ ప్రభావంతో మద్యానికి బానిసయ్యాడు. ఎంజెలీనా జోలి పిల్లలను వేధించడం, కొట్టడం చేయడంతో వివాదంలో కూరుకుపోయాడు. అలా తన భార్య ఎంజెలీనాకు దూరమయ్యాడు. అనంతరం మద్యం, డ్రగ్స్‌కు విపరీతంగా అలవాటు పడ్డారు.

  ఫ్లాపులు వెంటాడి..

  ఫ్లాపులు వెంటాడి..

  దాంతో కెరీర్‌ చాలా ఇబ్బందుల్లో పడింది. 2016లో అల్లైడ్, 2017లో వార్ మెషిన్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దాదాపు బ్రాడ్ పిట్ కెరీర్ ముగిసిందని అనుకొన్నారు. కానీ తన బలహీనతల నుంచి బయటపడి మళ్లీ నటనపై, కెరీర్‌పై దృష్టి పెట్టారు. దాని ఫలితమే 2020లో ఆస్కార్ ఉత్తమ సహాయనటుడు అవార్డును అందుకొన్నారు.

  డ్రగ్స్‌కు బానిసనయ్యా

  డ్రగ్స్‌కు బానిసనయ్యా

  2017‌లో ఓ ఇంటర్వ్యూలో బ్రాడ్ పిట్ మాట్లాడుతూ.. ఎక్కువ మోతాదులో మారిజువానా తీసుకొనే వాడిని. ఆ అలవాటుకు బానిసయ్యాను. అంతేకాకుండా విపరీతంగా మద్యం సేవించేవాడిని. మద్యం అలవాటు నుంచి నియంత్రించుకోవడానికి చేసిన చాలా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నా భార్య ఏంజెలినా నుంచి విడిపోయిన తర్వాత మద్యం నుంచి బయటపడటానికి చికిత్స పొందాను అని అన్నారు.

  పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్

  పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్

  ఇక కెరీర్‌, పర్సనల్ లైఫ్‌ను చూస్తే బ్రాడ్ పిట్ నటుడిగా నిర్మాతగా హాలీవుడ్‌లో పలు పాత్రలను పోషించారు. ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. మూన్ లైట్, ది బిగ్ షార్ట్, సెల్మా లాంటి టెలి ఫిలింస్‌ను అందించారు. వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎంజెలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టన్‌కు విడాకులు ఇచ్చారు.

  English summary
  Oscars awards 2020 Live Updates: The 92nd Academy Awards started at the Dolby Theatre in Los Angeles. Brad Pitt bags the Best Actor in a Supporting Role. Priyanka Chopra away from Oscars 2020. Brad pitt won best supporting actor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X