»   » చెడగొట్టడంతో పాటు..అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు..

చెడగొట్టడంతో పాటు..అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికా సెక్సీ మోడల్ పమీలా ఆండ్రిసన్ మితిమీరిన సెక్సీగా కనిపించి విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఎన్నో ప్రకటనలను అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బ్యాన్ చేసారంటే ఆమె ఎంతగా తెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ప్రకటనలు పిల్లలని చెడగొడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా వుంటే ఎప్పుడు అతి పనులే చేసే పమీలా ఇప్పుడో మంచి కార్యానికి శ్రీకారం చుట్టుంది. పెటా(PETA) తరపున పనిచేసేందుకు ఒప్పుకున్న పమీలా కెనడాలోని సీల్ చేపల వేటను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఆమె కెనడా ప్రధానికి లేఖ కూడా రాసింది. కెనడాలో జరగబోయే ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆ దేశ ఎంపిలు షీల్ చర్మంతో చేసిన దుస్తులు కావాలని అడగటంతో ఈ షీల్ ల వేట ఎక్కువయింది. దీంతో ఈ దారుణ చర్యపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చెడుపనులు చేస్తే విమర్శించిన మనం ఇప్పుడిలాంటి మంచి పని చేస్తున్న ఆమెను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే... ఏమంటారు..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu