»   » ఇన్నాళ్లూ ఏమీ లేదని బుకాయించినా..ఎట్టకేలకు ఒప్పుకున్నారు..!!

ఇన్నాళ్లూ ఏమీ లేదని బుకాయించినా..ఎట్టకేలకు ఒప్పుకున్నారు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ట్విలైట్ సినిమాల్లో జంటగా నటింస్తున్న రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ల మధ్య ఏదో తతంగం నడుస్తోందని ట్విలైట్ సినిమా మొదలయినప్పటి నుండీ వార్తలు వస్తూనే వున్నాయి. వీరు కూడా ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వున్నారు. ఈ సినిమాకు ఓ సీక్వెల్ (న్యూమూన్) విడుదలయి విజయం సాధించగా, మరో సీక్వెల్ కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా ఎలా అయితే కొనసాగుతోందో..వీరిద్దరి ప్రేమ కూడా అదే విధంగా కొనసాగుతోందని వార్తలు వస్తున్నా వారిద్దరు ఈ విషయమై పెదవి విప్పడం లేదు.

కానీ మొదటి సారిగా రాబర్ట్ BAFTA అవార్డుల కార్యక్రమానికి వచ్చినప్పుడు మీడియాతో వారిద్దరి అనుబంధం గురించి మాట్లాడుతూ నేను, క్రిస్టినా ఒకరిని వదలి ఒకరు వుండలేము. ఈ విషయం బయటపడితే మీరు(మీడియా) రాద్ధాంతం చేస్తారని ఇన్నాళ్లు బయటపెట్టలేదని, కానీ ఎవరేమనుకుంటారో అన్న భావనతో ఇద్దరం ఫ్రీగా వుండలేకపోతున్నామని ఈ విషయమై పెదవి విప్పుతున్నానని చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరు తాజాగా నటించిన ట్విలైట్ సినిమా సీక్వెల్ ఎక్లిప్స్ సినిమాలో చాలా హాట్ హాట్ గా కనిపిస్తారని, వీరిద్దరి మధ్య రొమాన్స్ బాగా పండిందని తెలిసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu