»   » 'అవతార్' నాయికకు అన్యాయం జరిగిందట..!!

'అవతార్' నాయికకు అన్యాయం జరిగిందట..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈ ఎడాది అతిపెద్ద హిట్ గా అవతరించిన అవతార్ సినిమా 9 నామినేషన్లు పొంది ప్రథమ స్థానంలో నిలిచింది, కానీ ఇందులో నెయిత్రిగా నటించిన తార జో సాల్దనాకు మాత్రం అన్యాయం జరిగింది అంటున్నారు పరిశీలకులు. నెయిత్రి పాత్రకు మంచి స్పందన రావడానికి కారణం అయిన ఆమె కష్టానికి ఫలితంగా అందరి అభినందనలూ అందుతున్నా ఆస్కార్ నామినేషన్ రాకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని వారు అభిప్రాయపడ్డారు.

తెర మీద సాంకేతిక పరిజ్ఞానం నటనని డామినేట్ చేసినా తెర వెనుక ఆమె కష్టానికి మాత్రం అవార్డు నామినేషన్ కూడా రాకపోవడం బాధాకరమని, ఆమెకు అన్యాయం జరిగిందని వారంటున్నారు..!! మరి మీరేమంటారు..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu