»   » మీడియా కోసం ముద్దులు పెట్టుకున్న జంట..!!

మీడియా కోసం ముద్దులు పెట్టుకున్న జంట..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచంలోనే అందమయిన జంటగా పేరుతెచ్చుకున్న ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడిపోనున్నారని ఇటీవల అంతర్జాతీయ మీడియా నానా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపడేసారు. కానీ మీడియా మాత్రం వీరిని వదలడం లేదు. ఏదైనా పబ్లిక్ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇద్దరూ ఆలోచనలే పడి సీరియస్ గా కనిపిస్తే చాలు ఆ ఫొటో తీసుకుని వీరిద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టింది. అందుకే ఇద్దరూ ముభావంగా వున్నారని ఓ వార్తని పుట్టించేస్తోంది.

దీంతో మీడియా వారికి చెక్ పెట్టాలని అనుకున్నారో ఏమో ప్రస్తుతం వెనీస్ లో వుంటున్న ఈ జంట జోలీ తాజాగా నటిస్తున్న ది టూరిస్ట్ సినిమా సెట్ లో అందరి ముందు పెదాలు కలుపుకొని వారి ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ జంట జోలీ నటిస్తున్న సినిమా టూరిస్ట్ సినిమా షూటింగ్ వెనీస్ పరిసరాల్లో జరగనుండటంతో వారి ఆరుగురు పిల్లలతో కలసి వెనీస్ కు తరలివెళ్లారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu