»   » వెండి తెరపై అద్భుతాలు సృష్టించే యానిమేషన్ సినిమాల అవార్డులు..!!

వెండి తెరపై అద్భుతాలు సృష్టించే యానిమేషన్ సినిమాల అవార్డులు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాల్ట్ డిస్నీకి సంబంధించిన ప్రతిష్టాత్మక యానిమేషన్ స్టుడియో 'పిక్సర్ యానిమేషన్ స్టుడియోస్' వారు నిర్మించిన యానిమేషన్ సినిమా 'అప్' (Up) సినిమాకు యానిమేషన్ రంగంలో ఆస్కార్ అవార్డులా భావించే అన్నీ(Annie) అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఉత్తమ యానిమేషన్ చిత్రం, ఉత్తమ దర్శకుడి క్యాటగిరీలో అప్ సినిమా అవార్డులు సాధించి పిక్సర్ యానిమేషన్ స్టుడియోస్ ఘనతను మరో సారి చాటిచెప్పింది.

డిస్నీ సంస్థ రూపొందించిన ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్(The Princess and the Frog), కొరలినే(Coraline), ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్(Fantastic Mr. Fox) చిత్రాలతో పోటీపడిన అప్ సినిమా వీటన్నిటినీ వెనక్కునెట్టి ఈ ఘనకీర్తిని సొంతం చేసుకుంది. కాగా ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్, కొరలినే చిత్రాలు ఈ అవార్డుల్లో చెరో మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నా ఉత్తమ చిత్రం, దర్శకుడి అవార్డులను నిలుపుకోలేకపోయాయి. కాగా ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్ సినిమా రైటింగ్ అవార్డును గెలుచుకుంది.

ఇక అప్ సినిమా ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ యానిమేషన్ చిత్రం ఈ రెండు విభాగాల్లో నామినేషన్ పొంది ఈ ఘనతను సాధించిన రెండవ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మరి ప్రతి సారీ అన్నీ(Annie) అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాకే ఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఆస్కార్ లభిస్తుండటం ఆనవాయితీగా జరుగుతూ వస్తుండటంతో ఈ ఏడాది ఆస్కార్ అప్ సినిమానే వరించే అవకాశాలు అధికంగా వున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu