»   » హాలీవుడ్ చిత్రంలో ప్రకాష్ రాజ్, డిటేల్స్

హాలీవుడ్ చిత్రంలో ప్రకాష్ రాజ్, డిటేల్స్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  న్యూయార్క్ : విలక్షణమైన నటుడుగా ఎదిగిన ప్రకాష్ రాజ్ త్వరలో ప్రపంచ ప్రేక్షకులను సైతం పలకరించనున్నారు. ఆయన తాజాగా సిక్స్ సస్పెక్ట్స్ అనే చిత్రంలో ఎంపికైనట్లు సమాచారం. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి మూలమైన నవల రాసిన వికాస్ స్వరూప్ తదుపరి పుస్తకం సిక్స్ సస్పెక్ట్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అలాగే స్టీవెన్ స్పీలబర్గ్ నిర్మించే ఇండో-పాక్ బోర్డర్ నేపధ్యంలో జరిగే కథ ఆధారంగా రూపొందే చిత్రం కోసం కూడా ఆయన్ను అడిగినట్లు తెలుస్తోంది. ఈ రెండింటి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ప్రకటన అఫీషియల్ గా వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.

  విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రం డైరక్ట్ చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో మరో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షుల ముందుకు రాబోతున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్.

  ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది. మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని 'ఉలవచారు బిర్యానీ' పేరుతో తెలుగులో రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించటంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...'ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించబోతున్నాను. మళయాలంలో హిట్టయిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెలుతుంది' అని తెలిపారు. మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి సాహిత్యం సిరివెన్నెల అందించనుండగా సంగీత బాధ్యతలు ఇళయరాజా స్వీకరించారట.

  English summary
  
 Prakash Raj is most likely to be the latest to test Hollywood waters. The actor, we hear, has been approached for two projects, both of which he seems to be considering. A source close to the actor reveals that the first one is an adaptation of the book Six Suspects, which has been written by Vikas Swarup (whose book Q&A was adapted into the Oscar-winning film Slumdog Millionaire).The other project is the Steven Spielberg film based on the India-Pakistan border, which the Hollywood filmmaker had discussed during his trip to India earlier this year.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more