»   » మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా ఫోజులివ్వడానికి ఎవ్వరూ ఖాళీగా లేరు

మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా ఫోజులివ్వడానికి ఎవ్వరూ ఖాళీగా లేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రెగ్నెంట్ విక్టోరియా బెకహాం యుయస్ వోగ్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా ప్రదర్శించనుందని వచ్చిన వార్తను తనే స్వయంగా ఖండించడం జరిగింది. ఈ ముప్పయి ఆరు సంవత్సరాల ఫ్యాషన్ మోడల్ ప్రస్తుతం ఏడు నెలలు ప్రెగ్నెన్సీతో ఉండడం.. ఈప్రెగ్నెన్సీని క్యాష్ చేసుకునే భాగంలో గతంలో డెమి మూరి ఇలాగే తాను ఏడు నెలల ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చింది. ఇప్పుడు డెమి మూరి బాటలో యుయస్ వోగ్ మ్యాగజైన్‌కు ప్రెగ్నెంట్ విక్టోరియా బెకహాం నగ్నంగా పోటో షూట్ చేశారని సమాచారం మొన్న వార్త వచ్చిన విషయం తెలిసిందే.

ఇది మాత్రమే కాకుండా యుయస్ వోగ్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ ఛీప్ అన్నా విన్‌టూర్ దగ్గర ఈఫోటో షూట్‌కు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయంటూ రూమర్ వచ్చింది. దీనిపై స్పందించినటువంటి విక్టోరియా బెకహాం అదంతా రూమర్ అని అలాంటి ఫోటో షూట్ ఏమి జరగలేదని వివరణ ఇచ్చారు. దీనిపై ఇక మీదట ఎమైనా రూమర్స్ వచ్చినట్లైతే నేను వారిపై క్లైమ్ చేయవలసి వస్తుందని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక విక్టోరియా బెకహాం విషయానికి వస్తే తను ఏడు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నానని అన్నారు.

English summary
Pregnant Victoria Beckham has dismissed rumours that she will pose nude for US Vogue magazine. It was previously reported that the 36-year-old was set to pose ''Demi Moore style'' for the cover of the US style bible.The reports claimed that editor-in-chief Anna Wintour was keen to depict Beckham at seven months pregnant with her fourth child.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu