»   » నా మాజీ భార్య కొత్త బాయ్ ప్రెండ్ చాలా మంచి మనిషి

నా మాజీ భార్య కొత్త బాయ్ ప్రెండ్ చాలా మంచి మనిషి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బ్రిటీష్ మోడల్ క్యాటీ ప్రైజ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన సింగర్ పీటర్ ఆండ్రూ ఇద్దరూ ప్రేమించి పెళ్శి చేసుకున్నారు. పీటర్ ఆండ్రూ తన మేనేజర్ అయినటువంటి క్లారి పోవెల్ తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడంటూ కారణం చేత ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెలతిరక్కుండానే కేజ్ ఫైటర్ అలెక్స్ రెయిడ్ అనే అతనిని పెళ్శి చేసుకుంది. కొన్నాళ్లకు అలెక్స్ రైడ్‌కి కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. ఐతే భార్య నుండి విడిపోయి సింగిల్‌గా జీవిస్తున్నాడు పీటర్ ఆండ్రే. కానీ క్యాటీ ప్రైస్ మాత్రం భర్త నుండి విడాకులు తీసుకున్న అతి తక్కువ రోజులకే మరో బాయ్ ప్రెండ్‌ని వెతుక్కుంది. అతని పేరు లియోనార్డో పెన్నా. లియోనార్డోని ఎక్కడ కలుసుకున్నానంటే జూనియర్స్ స్పోర్ట్స్ డే సందర్బంగా మా అబ్బాయి స్కూల్‌కి వెల్లడం జరిగింది.

అక్కడ నేను క్యాటీ ప్రైస్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే తన ప్రక్కనే ఉన్న కొత్త బాయ్ ప్రెండ్ లియోనార్డో పెన్నాని పరిచయం చేసింది. ప్రస్తుతానికి మాఇద్దరికీ పుట్టిన అబ్బాయి బాగోగులు ఇద్దరం కలసి చూసుకుంటున్నాం కాబట్టే వాడు రమ్మంటే అక్కడికి వెల్లడం జరిగిందని సెలవిచ్చాడు. మా పిల్లాడు స్కూల్‌లో ఎప్పుడూ ఫస్ట్ రావడం జరుగుతుంది. అందుకే వాడి జీవితంలో స్పోర్ట్స్ డే రోజు ప్రత్యేకతను సంతరించుకోవాలని వాడు ప్రైజ్ తీసుకోవడం నేను కూడా చూడాలనే ఉద్దేశ్యంతో స్కూల్ కి వెళ్శానని అన్నాడు.

ఈ సందర్బంలోనే క్యాటి ప్రైస్ కొత్త బాయ్ ప్రెండ్ లియోనార్డోని చూడడం జరిగింది. లియోనార్డో చూడడానికి చాలా నైస్ పర్సన్‌లాగా ఉన్నాడు. తను చాలా నిజాయితీగా ఉండడమే కాకుండా క్యాటీ ప్రైస్‌ని కూడా చక్కగా చూసుకుండాడని నేను అభిప్రాయపడుతున్నానని అన్నారు. ఇక పీటర్ ఆండ్రే, క్యాటీ ప్రైస్ నుండి విడిపోయిన తర్వాత అర్జెంటీనా మోడల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక క్యాటీ ప్రైస్ ఇద్దరు భర్తలను మార్చింది. ఒకరు పీటర్ ఆండ్రే, మరోకరు బాక్సర్ అలెక్స్ రైడ్.

English summary
There was a story last week saying that I met my ex-wife at junior’s sports day and that I shook hands with her new boyfriend Leandro. This is true. We were both there to support our son on his special day and things were perfectly amicable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu