»   » ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఎంగేజ్‌మెంట్‌.. ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన కామెంట్

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఎంగేజ్‌మెంట్‌.. ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హీరోయిన్ ని పెళ్ళాడబోతున్న బ్రిటన్ కింగ్.. ప్రియాంక చోప్రా కామెంట్

ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్ల్కే నిశ్చితార్థంపై గురించి అందాల తార ప్రియాంక చోప్రా స్పందించారు. మేఘన్‌కు హ్యారీ తగిన వరుడు, సరైన జోడి అని ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్ చేసింది. ఇంకా ఏమన్నారంటే..

మేఘనతో క్లోజ్ ఫ్రెండ్‌షిప్

మేఘనతో క్లోజ్ ఫ్రెండ్‌షిప్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నేపథ్యంలో మేఘన్ మార్ల్కేతో ప్రియాంక చోప్రాకు మంచి సంబంధాలు ఏర్పాడ్డాయి. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తన స్నేహితురాలు ప్రిన్స్ విలియమ్‌ను వివాహం చేసుకోవడంపై ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు.

 మేఘన్‌కు కంగ్రాట్స్

మేఘన్‌కు కంగ్రాట్స్

ప్రిన్స్ హ్యారీని వివాహం చేసుకోబోతున్న మేఘన్‌కు కంగ్రాట్స్. చాలా సంతోషంగా ఉంది. నీకు హ్యారీ సరైన భర్త. ఎల్లప్పుడూ నవ్వుతో సంతోషంగా ఉండాలి అని ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను ప్రియాంక షేర్ చేశారు. వచ్చే ఏడాది మేఘన్ పెళ్లి జరుగనున్నది.

 ప్రియాంక చోప్రాతో

ప్రియాంక చోప్రాతో

ప్రియాంక, మేఘన్ తొలిసారి టొరొంటోలో జరిగిన ఓ పార్టీలో కలుసుకొన్నారు. మేఘన్ ఆ సమయంలో కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది. దాంతో ప్రియాంకను ఆమె ఇంటర్వ్యూ చేశారు.

 బరాక్ ఒబామా ట్వీట్

బరాక్ ఒబామా ట్వీట్

ఇదిలా ఉండగా, ప్రిన్స్ హ్యారీ పెళ్లి గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ నిశ్చితార్థం చేసుకోబోతున్న నేపథ్యంలో మిచెలి, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మీరిద్దరూ జీవితాంతం సుఖ: సంతోషాలతో ఉండాలని కోరుకొంటున్నాం అని అన్నారు.

English summary
Priyanka Chopra took to Instagram to wish Suits actor Meghan Markle and Prince Harry, on their engagement. The Baywatch star took to Instagram to wish her close friend. She wrote, "Congratulations to my girl meghanmarkle and Prince Harry!! I'm so happy for you Meg! You deserve the best always..keep smiling that infectious smile. Xoxo." (sic).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu