»   » తలకు గాయమై...ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా

తలకు గాయమై...ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ప్రియాంక ప్రస్తుతం అమెరికన్‌ టీవీ సీరీస్‌ క్వాంటికోలో నటిస్తోంది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్‌ సన్నివేశంలో నటిస్తుండగా కిందపడి ఆమె తలకు గాయమైంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రియాంక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఏబీసీ ప్రొడక్షన్ టీం రిప్రజెంటేటివ్ తెలిపారు. టీవీ షో చిత్రీకరణ సందర్భంగా ఓ స్టంట్ సీన్‌లో నటిస్తున్నప్పుడు ఆమె ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు చిన్నపాటి గాయమైంది. ప్రమాదం కారణంగా ఇంటికే పరిమితమవడంతో శుక్రవారం నిర్వహించిన 'క్వాంటికో' ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఆమె హాజరుకాలేకపోయింది.

Priyanka Chopra hospitalised after accident on 'Quantico' set

పడిలేచిన కెరటంలా పరుగులు పెడుతున్న ప్రియాంకా చోప్రా... ప్రస్తుతం బీ-టౌన్ లో ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది... బాలీవుడ్ లో పలు ప్రెస్టీజియెస్ ప్రాజెక్ట్ లలో భాగస్వామి అయిన పిగ్గీచాప్స్... అటు హాలీవుడ్ లోనూ వీరంగం చేసేస్తోంది... పాప్ క్వీన్ గా సంపాదించుకున్న పాపులారిటీతో అమెరికన్ టీవీ ఛానల్ లో క్వాంటికో పేరుతో రూపొందుతున్న ప్రోగ్రామ్ లో తళుక్కుమనబోతోంది మన డస్కీ బ్యూటీ

క్వాంటికోలో ఎఫ్ బీఐ ట్రైనర్ గా కనిపించనున్న పీసీ... కిల్లర్ లుక్స్ తోనే కాదు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కట్టిపడేస్తోంది. గతంలో డాన్ సినిమాలోనూ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది ప్రియాంకా చోప్రా. అయితే... క్వాంటికో సీరీస్ లో మరింత స్టైలిష్ గా దర్శనమిస్తున్న పిగ్గీచాప్స్... ఎరోటిక్ సీన్స్ లోనూ భేష్ అనిపించుకుంది.

ఎఫ్ బీ ఐ ట్రైనీగా సత్తా చాటుకోవాలని పరితపించే యువతిగా క్వాంటికో సీరీస్ లో ప్రియాంక తళుక్కుమననుంది. అనుకోని పరిస్థితుల్లో భారతీయ మూలాలు ఉన్న పిగ్గీచాప్స్ ఓ కేస్ లో ఇరుక్కుంటుంది... దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? తన నిజాయితినీ ఎలా నిరూపించుకుంది అన్నదే ఈ సీరీస్ సారాంశం.

English summary
Indian actress Priyanka Chopra was involved in a minor accident on the set of her TV drama "Quantico" and taken to the hospital here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu