Priyanka Chopra హాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. ఆసక్తికరమైన కథతో..
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటించిన మరో హాలీవుడ్ చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ను అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా పేరు టెక్ట్స్ ఫర్ యూ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా పేరును ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ అని మార్చారు. ఈ సినిమా 2016లో జర్మన్‌లో రూపొందిన ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాకు కరోలైన్ హెర్ఫర్త్ దర్శకత్వం వహించారు.
ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ చిత్రంలో ప్రియాంక భావోద్వేగమైన పాత్రలో కనిపిస్తారు. తనకు కాబోయే భర్త మరణం తర్వాత చోటుచేసుకొన్న పరిస్థితుల నుంచి దూరంగా పారిపోయే మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో తన కాబోయే భర్త నంబర్‌కు ఆమె మెసేజ్ పంపిస్తుంటుంది. అయితే ఆ నంబర్‌ను మరో వ్యక్తికి కేటాయిస్తారు. ఆ విధంగా అపరిచితవ్యక్తితో అనుబంధం పెరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది సినిమా కథ.

ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ చిత్రంలో హాలీవుడ్ నటి సెలీన్ డియన్ కూడా నటిస్తున్నది. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రస్సెల్ టోవీ, ఓమిడ్ డాజిలీ, సెలియా ఇమ్రై నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అమెరికా, లండన్‌లో జరిగింది.
ప్రియాంక సినీ కెరీర్ విషయానికి వస్తే.. రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











