»   » అదిరేటి డ్రస్సుతో ప్రియాంక జిగేల్.. జిగేల్..

అదిరేటి డ్రస్సుతో ప్రియాంక జిగేల్.. జిగేల్..

Written By:
Subscribe to Filmibeat Telugu

గోల్డెన్ గ్లోబ్స్, కేన్స్ వేదిక ఏదైనా గానీ అందాల సుందరి ప్రియాంక చోప్రా అడుగుపెట్టిందంటే వందల కొద్ది కెమెరాల ఫ్లాష్‌ల మోత మోగించాల్సిందే. తాజాగా హలీవుడ్‌లో బేవాచ్ సుందరి చేసిన హడావిడి విదేశీ మీడియాను పిచ్చెక్కించింది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక అందాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంక..తాజాగా ఓ ప్రీమియర్ షోలో తళుక్కుమన్నది.

ట్రెండీ లుక్‌తో అదుర్స్

ట్రెండీ లుక్‌తో అదుర్స్

న్యూయార్క్‌లో జరిగిన ది డెఫియాంట్ వన్స్ టీవీ ప్రోగ్రాం ప్రీమియర్ షోకు ప్రియాంక బ్లాక్ డ్రెస్‌తో హాజరై ట్రెండీ లుక్‌తో అదరగొట్టింది. హాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ డీఆర్ డ్రే, జిమ్మీ లొవైన్‌తో కలిసి ఫొటోలకు ఫోజిచ్చింది ప్రియాంక. ప్రీమియర్‌లో ప్రియాంక సందడి చేసిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్

విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం ఇండియాలోనే కాదు విదేశాల‌లో ఉన్న సినీ లవ‌ర్స్ ని త‌న అభిమానుల లిస్ట్ లో చేర్చుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రియాంక చోప్రా ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. న్యూయార్క్ కి చెందిన లీడింగ్ టాటు ఆర్టిస్ట్ ఆంటోలే ప్రియాంక చోప్రాని స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీగా మార్చేశాడు. ఓ వ్య‌క్తి శ‌రీరంపై స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ మాదిరిగా ప్రియాంక టాటూ వేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఆ టాటూలో ప్రియాంక చోప్రా లుక్స్ ఆకట్టుకొన్నాయి.

స్కిల్ ఇండియాకు ప్రచారకర్తగా

స్కిల్ ఇండియాకు ప్రచారకర్తగా

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ పథకం స్కిల్ ఇండియా ప్రచారకర్తగా నటి ప్రియాంక చోప్రా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిని చూపింది. స్కిల్ ఇండియాపై యువతలో అవగాహన కల్పించడం, వారిని చైతన్య పర్చడంలో ఆమె కీలకపాత్ర పోషించనున్నారు. గతంలో ఈ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా క్రికెటర్లు విరాట్‌కోహ్లీ, సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మలోత్రా, షబానా అజ్మీ, సింగర్ మోహిత్ చౌహాన్ పనిచేశారు.

భన్సాలీ గుస్తాకియాలో..

భన్సాలీ గుస్తాకియాలో..

హాలీవుడ్‌లో బేవాచ్‌తోపాటు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న గుస్తాకియా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కవి సాహిర్ లుధియాన్వి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు.

English summary
Priyanka recently attended the premiere of the show ‘The Defiant Ones’ held in New York. She looked stunningly sexy in the black double-breasted blazer with a plunging neckline. The blazer was paired with a flapper pant which had shimmery fringes. We wish if we could avoid the wrinkles on her blazer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X