For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వేషాల కోసం పడకగదికి.. నాకు తప్పలేదు.. హీరోలు బాధితులే.. ప్రియాంక చోప్రా

  By Rajababu
  |
  వేషాల కోసం పడకగదికి.. అది నాకు తప్పలేదు..

  వేషాల కోసం పడకగది (క్యాస్టింగ్ కౌచ్)కి రమ్మనే దుష్ట సంస్కృతిపై ఒక్కొక్కరే పెదవి విప్పుతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టెన్ ఉదంతం బయట ప్రపంచానికి వెలుగు చూసిన తర్వాత ఈ తరహా కథనాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా షాకింగ్ విషయాలను వెల్లడించడంతో సినీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పెంగ్విన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. తనకు లైంగిక, బంధుప్రీతి వేధింపులు తప్పలేదు అని చెప్పింది.

   ఆ పరిస్థితులు భయపెట్టేవి..

  ఆ పరిస్థితులు భయపెట్టేవి..

  వేషాల కోసం నిర్మాతల వద్దకు వెళ్లినప్పుడు చాలా భయమేసేది. పరిస్థితి అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని నా సహచరులు కూడా భయపెట్టేవారు. నిర్మాతల గదిలోకి బిక్కు బిక్కు మంటూ వెళ్లేదానిని. నా సినీ కెరీర్ ఆరంభంలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది.

  చివరి నిమిషంలో తప్పించారు

  చివరి నిమిషంలో తప్పించారు

  ఓ సందర్భంలో నాకు ఓ సినిమా కన్ఫర్మ్ అయింది. అగ్రిమెంట్‌పై సంతకం చేశాను. కానీ నన్ను ఆ సినిమా నుంచి తప్పించి తన గర్ల్‌ఫ్రెండ్ సిఫారసు చేసిన ఓ హీరోయిన్‌ను తీసుకొన్నారు. ఇదోరకమైన వేధింపులు సినీ పరిశ్రమలో ఎక్కువగానే ఉంటాయి. దర్శకులు చెప్పారని, నిర్మాత బంధువులు సూచించారన్న కారణంతో నన్ను చాలా సార్లు సినిమాల నుంచి తప్పించారు.

  ఎదురించే శక్తి నాకు లేదు

  ఎదురించే శక్తి నాకు లేదు

  అప్పట్లో అలాంటి పరిస్థితులను ఎదురించే శక్తి లేకపోయింది. చివరి నిమిషంలో తప్పించినన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అధికారం, డబ్బు బలం ఉన్న వ్యక్తులతో నాకు పోరాడే శక్తి లేకపోయింది. అలాంటి వారి గొంతెమ్మ కోరికలను లెక్క చేయకపోయేదానిని.

   నా కుటుంబ సపోర్ట్

  నా కుటుంబ సపోర్ట్

  సినీ పరిశ్రమలో ప్రతికూల పరిస్థితులను ఎదురించే ధైర్యం నా కుటుంబ నేపథ్యం వల్ల ఏర్పడింది. నా కుటుంబం నుంచి నాకు మంచి సపోర్ట్ ఉండటం వల్ల నేను ఈ స్థాయికి చేరుకొన్నాను అని ప్రియాంక వెల్లడించింది.

   హీరోలకు కూడా తప్పలేదు

  హీరోలకు కూడా తప్పలేదు

  ఇటీవల ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ అనే రియాల్టీ షోలో మాట్లాడుతూ.. వేషాల కోసం పడక గదిలోకి వెళ్లే సమస్య కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లు అనుభవించారు. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు జాడ్యం ఆడ, మగ అనే తేడా లేకుండా ఉంటుంది అని ప్రియాంక చెప్పింది.

   బాలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి

  బాలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి

  హర్వే వెయిన్‌స్టెయిన్ మాదిరిగా బాలీవుడ్‌లో ఎవరూ లేరా అని రచయిత శోభాడే అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానమిస్తూ.. ఆ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతున్నావు.. ఆ వివాదంలోకి నన్ను లాగవద్దు అని అన్నారు.

   హర్వేపై అలా గళం విప్పారు..

  హర్వేపై అలా గళం విప్పారు..

  మీటూ అనే హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. హర్వే పాల్పడిన వేధింపులపై అందరూ గళం విప్పారు. అది కేవలం అమెరికాలోనే కాకుండా అన్ని దేశాలకు అది విస్తరించింది.

  English summary
  Priyanka Chopra Said I have faced abuse of power, thrown out of films for someone’s girlfriend. Talking about sexual harassment in film industry, Priyanka Chopra said men also faced casting couch. I have been thrown out of films because someone else was recommended... A girlfriend was recommended after I was signed for a movie. So, that’s an abuse of power... Girlfriend of the hero or girlfriend of the director.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more