»   » ట్రైలర్: ప్రియాంక చోప్రా రెండవ హాలీవుడ్ చిత్రం.. అభిమానులని తీవ్రంగా!

ట్రైలర్: ప్రియాంక చోప్రా రెండవ హాలీవుడ్ చిత్రం.. అభిమానులని తీవ్రంగా!

Subscribe to Filmibeat Telugu

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ రాణిస్తోంది. ప్రియాంక ఇప్పటికే క్వాంటికో టివి సిరీస్ ద్వారా హాలీవుడ్ లో గుర్తిమ్పు తెచ్చుకుంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం 'బేవాచ్'. బేవాచ్ తరువాత ప్రియాంక 'ఎ కిడ్ లైక్ జాక్' చిత్రంలో నటించింది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కావడం విశేషం. మూడు పదుల వయసులో కూడా ప్రియాంక చోప్రా అందం తరగడం లేదు సరికదా పెరుగుతోంది.

ఆ అందం, నటనతోనే బాలీవుడ్ లో రాణించిన ప్రియాంక చోప్ర ఇప్పుడు హాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఎ కిడ్ లైక్ జాక్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ద్వారా పిసి అభిమానులకు తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ లో పిసి కేవలం 3 క్షణాలు మాత్రమే మెరుస్తుంది. కానీ ఈ చిత్రంలో పిసి కీలక పాత్రలో నటిస్తన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సిలాన్ హోవార్డ్ దర్శకుడు.నాలుగేళ్ళ చిన్నారి చుట్టూ అల్లిన కథ ఇది. బాలీవుడ్ లో స్టార్ హిరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రియాంక క్వాంటికో సిరీస్ కి గాను రెండు పీపుల్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకోవడం విశేషం.

English summary
Priyanka Chopra's second hollywood movie trailer released. A Kid Like Jake is her new movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X