»   » ‘జేమ్స్ బాండ్’ హీరో రహస్య వివాహం బట్ట బయలు

‘జేమ్స్ బాండ్’ హీరో రహస్య వివాహం బట్ట బయలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ నటుడు డానియల్ క్రేగ్ బాండ్ మూవీ 'స్పెక్టర్' విడుదల కావడంతో అతని జీవితానికి సంబంధించిన ఓ రహస్యం బహిర్గతమైంది. ప్రముఖ నటి రేచల్ వెయిజ్‌ను డానియల్ క్రేగ్ నాలుగేళ్ళ క్రితమే(2011) వివాహం చేసుకున్నాడట. అయితే జేమ్స్ బాండ్‌గా అతను నటిస్తున్న ఆఖరి చిత్రం 'స్పెక్టర్' విడుదలయ్యే వరకూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావించారట. తాజాగా ‘స్పెక్టర్' మూవీ విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఈ విషయాన్ని వారే స్వయంగా బయట పెట్టారు.

‘స్పెక్టర్' మూవీ వివరాల్లోకి వెళితే...
హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. కొన్ని దేశాల్లో అంతకంటే ముందే విడుదలైంది.

Rachel Weisz explains why she keeps marriage to Daniel Craig private

దాదాపు రూ. 2 వేల కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాల కంటే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాలో కార్ల చేజింగుతో సాగు యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ అత్యంత ఖరీదైన 7 ఆస్టన్ మార్టిన్ కార్లు ధ్వంసం చేసారు.

‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సినిమా తర్వాత తాను మరోసారి జేమ్స్ బాండ్ పాత్ర చేయనుగాక చేయను అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డేనియర్ క్రెగ్ మాట్లాడుతూ ‘మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అని వ్యాఖ్యానించారు. మరోసారి నన్ను చేయమని అడిగితే రెండేళ్లు ఆగమంటాను. రెండేళ్ల తర్వాత ఒక వేళ చేయాలని అనిపిస్తే... అది డబ్బు కోసమే తప్ప మరో కారణం ఉండదు అన్నాడు.

English summary
Rachel Weisz and Daniel Craig are one of the most private couples in Hollywood - rarely making public appearances together or speaking out about their relationship - and now we know why. The actress, who tied the knot with the James Bond star in June 2011, said she wants to "protect" their relationship from the public eye.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu