»   » విలన్లంతా నా వద్దకే వస్తున్నారు: ‘అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్’ రానా వెర్షన్ ట్రైలర్

విలన్లంతా నా వద్దకే వస్తున్నారు: ‘అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్’ రానా వెర్షన్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రఖ్యాత హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న మరో భారీ చిత్రం 'అవేంజర్స్ : ది ఇన్ఫినిటీ వార్'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 27న గ్రాండ్‌గా విడుదలవ్వబోతోంది. ఇండియాలో ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్లో మెయిన్ విలన్ థైనోస్ పాత్రకు రానా దగ్గుబాటి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాకు పని చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది అంటూ రానా వెల్లడించారు. ఈ మేరకు రానా డబ్బింగ్ చెబుతున్న వీడియోను మార్వెల్ ఇండియా సంస్థ విడుదల చేసింది.

అందరు విలన్లు నా దగ్గరికే వస్తున్నారు

భల్లాలదేవుడు చేసిన తర్వాత ప్రపంచంలో ఉన్న విలన్లు అందరూ నా దగ్గరికే వస్తున్నారు. అవేంజర్స్ థైనోస్ అనేది చిన్నప్పటి నుండి నాకు తెలిసిన కామిక్ క్యారెక్టర్. ఇంతకు ముందు మార్వెల్ సినిమాల్లో కూడా మనం చూశాం. ఈ సారి ఇన్ఫినిటీ వార్‌‌లో థైనోస్‌ పాత్రకు నేను వాయిస్ ఇస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.... అని రానా తెలిపారు.

 థాయిలాండ్ నుండి ప్రత్యేక విమానంలో

థాయిలాండ్ నుండి ప్రత్యేక విమానంలో

నన్ను వాయిస్ ఇవ్వమని అడిగినపుడే థ్రిల్ ఫీలయ్యాను. ఈ సంవత్సరం నెల రోజుల క్రితం బ్లాక్ పాంథర్ అనే సినిమా చూశాను, దానికంటే మూడు నెలల ముందు డాక్టర్ స్ట్రేంజ్ అనే సినిమా చూశాను. అంతకు ముందు ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా కొట్టుకునే సివిల్ వార్ అనే సినిమా చూశాను. అన్ని సినిమాలు నాకు నచ్చాయి. ఈ సినిమాకు వాయిస్ ఇవ్వడం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే థాయిలాండ్‌లో షూటింగ్ చేసుకుంటూ, మధ్యలో ప్లెయిన్ వేసుకుని ముంబై వచ్చి ఇక్కడ డబ్బింగ్ చెప్పి వెళ్లేవాడిని. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.... అని రానా తెలిపారు.

 అవేంజర్స్: ది ఇన్ఫినిటీ వార్

అవేంజర్స్: ది ఇన్ఫినిటీ వార్

అవేంజర్స్: ది ఇన్ఫినిటీ వార్ చిత్రానికి జో రుస్సో, ఆంటోనీ రుస్సో దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, థోర్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరో క్యారెక్టర్లు అద్భుత సాహస విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి.

 తెలుగులో భారీ రిలీజ్

తెలుగులో భారీ రిలీజ్

అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సమ్మర్ సెలవులు కావడంతో ఈ చిత్రానికి ఇక్కడ భారీ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు ఇష్టపడే సూపర్ హీరో క్యారెక్టర్లతో ఈ చిత్రం రూపొందడం విశేషం.

English summary
Rana Daggubati channels his inner villain in a new behind-the-scenes video in which he is dubbing for Thanos in the Telugu version of Avengers: Infinity War. “After playing Bhallaladeva, all the villain characters in the world were flocking towards me,” he says in the video. But because of his childhood love for Marvel and these characters, Rana said ‘yes’ immediately. “To provide the voice for Thanos is really exciting for me,” he says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X