»   » ‘రెసిడెంట్ ఈవిల్ ది ఫైనల్ చాప్టర్’ ఇండియా రిలీజ్ డేట్, స్టోరీలైన్

‘రెసిడెంట్ ఈవిల్ ది ఫైనల్ చాప్టర్’ ఇండియా రిలీజ్ డేట్, స్టోరీలైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ ‌: రెసిడెంట్‌ ఈవిల్‌ సీరీస్‌లో చివరిచిత్రంగా రూపొందిన 'రెసిడెంట్‌ ఈవిల్‌: ది ఫైనల్‌ చాప్టర్‌' చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. ఒక పాపులర్‌ వీడియో గేమ్‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం 2002లో విడుదలై సంచలన విజయం సాధించింది. దాంతో మరో ఐదు సీక్వెల్‌ చిత్రాలు తీశారు. అవి కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇప్పుడు చివరిదైన ఆరో భాగం తెరకెక్కింది.

రెసిడెంట్ ఈవిల్ సీరిస్‌లో భాగంగా ఇప్పటికే ఐదు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆరో భాగం 'రెసిడెంట్ ఈవిల్ ది ఫైనల్ చాప్టర్' విడుదలకు సిద్ధమైంది. గత భాగం ఎక్కడ ముగిసిందో అక్కడినుండే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మానవాళి అంతం కోసం సాగిన నరమేధలో హీరోయిన్ అలీస్ బతికి బైటపడుతుంది. మరో భారీ యుద్ధంతో మిగిలిన అందరినీ మట్టుపెట్టేందుకు అంబ్రెల్లా కార్పొరేషన్ ప్రయత్నిస్తుండడంతో అలీస్ తన శక్తులన్నింటినీ కూడగట్టుకుని ఎలా పోరాటం చేసింది అనేదే ఈ సినిమాలో ప్రధానమైన కథ.

హాలీవుడ్‌లో దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా భారతదేశంలో కూడా అంతే విజయం సాధించనుందని దర్శక,నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు పాల్ డ‌బ్ల్యూ . ఎస్ ఆండర్సన్.ఈ చిత్రంలో మిల్లా జోవోవిచ్, ఆలీ లార్టర్, రూబీ రోజ్, విలియం లెవీ, ఇయాన్, షాన్ రాబర్ట్స్, లీ జూన్-గి, ఇయాన్ గ్లెన్ న‌టించారు. ఈ చిత్రానికి పాల్ హ‌స్లింగ‌ర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలోని ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. ఈ ట్రైల‌ర్‌ని మీరే చూడండి.

English summary
Resident Evil: The Final Chapter is a science fiction action horror film written and directed by Paul W. S. Anderson. It is the sequel to Resident Evil: Retribution and the sixth and final installment in the Resident Evil film series. And now the film is ready to release in India on 3 February 2017 In English, Hindi, Tamil and Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu