For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టీవెన్‌ స్పీల్ బర్గ్ ఇండియా రాక...మన సినీ ప్రముఖులతో విందు

  By Srikanya
  |

  లాస్ ఏంజిల్స్ : ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మంగళవారం మన దేశం వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ సిని ప్రముఖులు 60 మంది ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబాని..ఆహ్వానం తో స్పీల్ బర్గ్ ఇండియాకు వస్తున్నారు. ఆస్కార్‌ బరిలో నిలిచిన 'లింకన్‌' సినిమాను వీరిద్దరే నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించే అనిల్‌ అంబానీ ముంబయిలో వేడుకను నిర్వహిస్తున్నారు.

  ఆ క్రమంలోనే సినిమాల రూపకల్పనలో ఎలాంటి మెళకువలు పాటించాలి? అనే కోణంలో స్పీల్‌బర్గ్‌, మన దర్శకులు ముచ్చటించుకుంటారు. ఈ సమావేశానికి ఆహ్వానం అందిన వారిలో ప్రముఖ దర్శకులు శ్యామ్‌ బెనగల్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, అనురాగ్‌ కశ్యప్‌, ఫర్హాన్‌ అక్తర్‌, జోయా అక్తర్‌, రామ్‌గోపాల్‌ వర్మ, ఎ.ఆర్‌.మురుగదాస్‌, ప్రియదర్శన్‌, ప్రభుదేవా, సంజయ్‌లీలా భన్సాలీ, ఫరా ఖాన్‌, ఆర్‌.బల్కి, బిజోయ్‌ నంబియార్‌, డేవిడ్‌ ధావన్‌, ఇంద్రకుమార్‌, కిరణ్‌రావ్‌, మిలన్‌ లుథ్రియా తదితరులున్నారు. 13వ తేదీన ముంబయిలోనే స్పీల్‌బర్గ్‌ గౌరవార్థం సినీ ప్రముఖులతో విందు కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

  ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన సినీ తారలకు ఆహ్వానాలు అందాయి. వీరిలో దక్షిణాది నటులు ప్రకాష్‌రాజ్‌, మోహన్‌లాల్‌ ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, అజయ్‌దేవగణ్‌ తదితరులు హాజరవుతారు. రిలియన్స్ ఎంటర్ట్మెంట్స్,డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ పేరు మీద అమెరికాలో చాలా ప్రాజెక్ట్స్ చేపట్టింది. ఆ డ్రీమ్ వర్క్ స్టూడియోస్ సంస్ధలో స్పీల్ బర్గ్ ముఖ్యులు. కౌబాయ్ అండ్ ఎలియన్స్, ది హెల్ప్, రియల్ స్పీల్, ది ఫైటర్, లింకన్, వార్ హౌస్ చిత్రాలు రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీదే తెరకెక్కాయి. ప్రస్తుతం స్పీల్ బర్గ్ .. 'లింకన్‌' చిత్రం విజియోత్సాహంలో ఉన్నారు.

  ఇక 'షిండ్లర్స్‌ లిస్ట్‌', 'సేవింగ్‌ ప్రైవేట్‌ర్యాన్‌', 'ఈటీ', 'జాస్‌', 'జురాసిక్‌ పార్క్‌'... లాంటి చిత్రాలను తలచుకోగానే గుర్తొచ్చే స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లింకన్‌'. యూఎస్‌లో బానిసత్వాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలో పదమూడో చట్ట సవరణ చేసేందుకు లింకన్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కింది. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, కాథలీన్‌ కెన్నడీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకోవడంతో కలిపి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌కి ఇది పదిహేనో ఆస్కార్‌ నామినేషన్‌.

  English summary
  
 Steven Spielberg has landed in Mumbai for a close encounter with the Indian film industry. The acclaimed director is said to be visiting the country to celebrate the success of Lincoln with his principle financial backer in DreamWorks, Indian billionaire Anil Ambani, chairman of Reliance Group. The list of participants includes a bevy of leading Indian film names, such as Rajkumar Hirani, Anurag Kashyap, Farhan Akhtar, Zoya Akhtar, Abhishek Kapoor, Habib Faisal, Ram Gopal Varma, Sanjay Leela Bhansali, Farah Khan, and dozens more.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X