»   » ఆ 'హీరో' కోసం ఆడాళ్లు కాదు మగాళ్లు 'క్యూ' కడుతున్నారు

ఆ 'హీరో' కోసం ఆడాళ్లు కాదు మగాళ్లు 'క్యూ' కడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ స్టార్, హీరో అని నపిలవబడే రికీ మార్టిన్ పాటలంటే ఎంతో మంది పడిచస్తారు. ఇక ఆయనకు అమ్మాయిల్లో ప్రత్యేకమయిన ఫ్యాన్ ఫాలోయింగి వుంది. చాలామంది అమ్మాయిలకు అతను కలల రాకుమారుడు. కానీ ఇప్పుడాయన చేసిన ఈ ప్రకటనతో అమ్మాయిలి సోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతకు ముందు ఇతగాడు ఓ సరొగేట్(గర్బాన్ని అద్దెకు తీసుకోవడం) మదర్ సాయంతో ఇద్దరు పిల్లలకు తండ్రి అయి అందరినీ ఆష్చర్యపరిచాడు. తనే పెళ్లిచేసుకొని తండ్రి కావచ్చుకదా..? ఇలా చేసాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ ప్రశ్నకు అసలు జవాబు అప్పుడు చెప్పకుండా దాటవేసినా ఇప్పుడు మాత్రం చెప్పకతప్పలేదు రికీ మార్టిన్ కు. తను ఓ గే అని వచ్చిన వదంతులను కొట్టిపారేస్తూ వచ్చిన ఆయన తాజాగా తను గే అని ఒప్పుకున్నాడు. తనని తాను గే అని ప్రకటించుకోవడానికి గర్వపడుతున్నాను అని చెప్పిన ఆయన ఇన్నాళ్లు ఈ ప్రకటన చేద్దామన్నా నా కెరీర్ కు అవరోధం అవుతుందని సన్నిహితులు వారించడంతో ఆగిపొయాను అని చెప్పాడు. దీంతో ఆయన మహిళాభిమానుల గుండెల్లో ఆయన చిత్రం వెయ్యిముక్కలయిపోయిందట. కానీ అబ్బాయిలు మాత్రం అతన్ని ఆకట్టుకొవడానికి క్యూలు కడుతున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu