»   » బెదిరింపు లేఖలతో హడలిచస్తున్న అమ్మడు

బెదిరింపు లేఖలతో హడలిచస్తున్న అమ్మడు

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ గాయని రిహన్నాకు ఇటీవల ఓ అగంతకుడు రెండు అనుచితమయిన, భయపెట్టే విధంగా వున్న లేఖలను పంపాడట. ఈ లేఖల సారాంశం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఆమెను సెక్సువల్ గా బెదింరిండమే కాకుండా, హతమారుస్తాననే అర్థం వచ్చేలా ఈ లేఖ వుందట. దీంతో రిహన్నా హడలిపోతోందట.

ఇంతకు ముందు రిహన్నా బాయ్ ఫ్రెండ్, ఆమెను ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా హింసించిన గాయకుడు క్రిస్ బ్రౌన్ ఈ లేఖల వెనుక వున్నాడని వినిపిస్తోంది. ప్రస్తుతం రిహన్నాతో కులుకుతున్న కొత్త బాయ్ ఫ్రెండ్ మ్యాట్ కెంప్ ఈ లేఖలతో ఖంగుతిన్నాడట. రిహన్నాకు భద్రతను కట్టుదిట్టం చెయ్యాలని సెక్యూరిటీ సిబ్భందిని ఆదేసించాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu