»   » అవతార్ ను వెనక్కు నెట్టిన రొమాంటిక్ సినిమా..!!

అవతార్ ను వెనక్కు నెట్టిన రొమాంటిక్ సినిమా..!!

Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వరుసగా ఏడు వారాల పాటు తొలి స్థానంలో నిలిచి, ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిన సినిమా అవతార్. ఎదురేలేకుండా దూసుకుపోతున్న అవతార్ ప్రభంజనానికి ఓ రొమాంటిక్ సినిమా బ్రేక్ వేసింది. "డియర్ జాన్" అనే ఈ సినిమా వరుసగా బాక్సాఫీసు వద్ద ప్రథమ స్థానంలో నిలుస్తూ వచ్చిన అవతార్ సినిమాను రెండవ స్థానానికి నెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. విడుదలయిన తొలి వారంలో ఈ డియర్ జాన్ సినిమా 32.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి, ఈ ఘనతను సాధించింది. ఇక అవతార్ సినిమా 23.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో రెండవ స్థానంలో నిలిచింది.

ఇక ఈ వారం బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన పది చిత్రాల వివరాలు ఇలా వున్నాయి.
1. డియర్ జాన్ ---- 32.4 మిలియన్ డాలర్లు
2. అవతార్ ---- 23.6 మిలియన్ డాలర్లు
3. ఫ్రమ్ ప్యారిస్ విత్ లవ్ ---- 8.1 మిలియన్ డాలర్లు
4. ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ ---- 7 మిలియన్ డాలర్లు
5. టూత్ ఫెయిర్ ---- 6.5 మిలియన్ డాలర్లు
6. వెన్ ఇన్ రోమ్ ---- 5.5 మిలియన్ డాలర్లు
7. ది బుక్ ఆఫ్ ఇలై ---- 4.8 మిలియన్ డాలర్లు
8. క్రేజీ హార్ట్ ---- 3.7 మిలియన్ డాలర్లు
9. లీజియన్ ---- 3.4 మిలియన్ డాలర్లు
10. షెర్లాక్ హాల్మెస్ ---- 2.63 మిలియన్ డాలర్లు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu