»   » అయిదేళ్ళ అభిమాని ఇక బతకడని తెలిసి... అతని కోసం ఆ హీరో ఏం చేసాడంటే....

అయిదేళ్ళ అభిమాని ఇక బతకడని తెలిసి... అతని కోసం ఆ హీరో ఏం చేసాడంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

డెడ్ పూల్ సినిమా గుర్తుందా..?? మార్వేల్‌ కామిక్స్‌ పాత్ర డెడ్‌పూల్‌ ఆధారంగా హాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రమిది. కేన్సర్‌ను నయం చేసుకోవడానికి తనపై తాను ప్రయోగం చేసుకుంటాడు హీరో. ఆ సమయంలో అనుకోకుండా కొన్ని అతీత శక్తులు అతనిలోకి ప్రవేశిస్తాయి. వాటిని తనకు అనుకూలంగా మలచుకుని, తనని అంతం చేయాలనుకునే వ్యక్తిని ఎలా మట్టుబెట్టాడన్నది కథాంశం. ఈ సినిమా హాలీవుడ్ లో సంచలనమైంది. దీనికి సీక్వెల్ గా వచ్చిన డెడ్ పూల్ 2,3 కూడా అదే స్థాయిలో ఆడాయి. ఈ సినిమాతో అప్పటికే స్టార్ గా ఉన్న ర్యాన్ రీనాల్డ్స్ ఒక్కసారి హాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు...

మరి కొద్ది నెలలకంటే బతకడు

మరి కొద్ది నెలలకంటే బతకడు

అయితే ఈ సినిమా తో ర్యాన్ కి అభిమానులూ పెరిగి పోతారు కదా.... అలా ఇతనికి ఒక బుల్లి ఫ్యాన్ కూడా ఉన్నాడు. ఇక్కడ అత్యంత విషాదం ఏమిటంటే ఆ చిన్నారి మరి కొద్ది నెలలకంటే బతకడు. ఇంగ్లాండ్‌కు చెందిన డేనియల్ డౌనింగ్ అనే ఐదేళ్ల చిన్నారి వీరాభిమాని.

బ్రెయిన్ ట్యూమర్‌తో

బ్రెయిన్ ట్యూమర్‌తో

ఆ చిన్నారి ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. మరికొన్ని నెలలు మించి అతడు బతకడని వైద్యులు చెప్పారు. అయితే.. చనిపోయేలోపు తన అభిమాన హీరో రీనాల్డ్స్‌ను చూడాలన్నది ఆ చిన్నారి తాపత్రయం. అతడి కోరికకు అనుగుణంగా ఓ రోజు రీనాల్డ్స్.. డేనియల్‌కు వీడియో కాల్ చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. అప్పుడు ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిన్నారితో కాసేపు మాట్లాడిన రీనాల్డ్స్ తాను ఎక్కడున్నది, ఏం చేస్తున్నది పంచుకున్నాడు.

టాలీవుడ్ లోనూ

టాలీవుడ్ లోనూ

ఇలా టాలీవుడ్ లోనూ పలు సంఘటనలు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్‌చరణ్ తదితర హీరోలు ఉన్నారు. తమ చిన్నారి అభిమానులని స్వయంగా కలిసారు. ఇప్పుడు ర్యాన్ కూడా తన చిన్నారి అభిమానికి అదే మాటిచ్చాడు.

త్వరలోనే వచ్చి కలుస్తాను

త్వరలోనే వచ్చి కలుస్తాను

ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, త్వరలోనే వచ్చి కలుస్తానని చెప్పాడు. చిన్నారి వేసుకున్న టీ షర్టు గురించి మాట్లాడిన హీరో.. అలాంటి టీషర్టును ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నానని, తనకు ఎక్కడా ఆ టీషర్టు దొరకలేదని చెప్పాడు. అభిమాన హీరోనే స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడడంతో చిన్నారి చాలా ఉత్సాహవంతుడైపోయాడు. ఎప్పుడూ నీరసంగా ఉండే డేనియల్.. రీనాల్డ్స్ ఫోన్‌తో చలాకీగా మారాడాని అతడి తల్లి చెప్పింది..

6 వేల బ్రిటన్ పౌండ్లు

ఈ అయిదేళ్ళు కూడా నిండని చిన్నారి చికిత్స కోసం కనీసం 6 వేల బ్రిటన్ పౌండ్లు అవసరం అవుతాయట. ఇప్పుడు అదే ప్రయత్నం లో విరాళాలు సేకరిస్తున్నాడు ఆ కుటుంబానికి దగ్గరి బందువు ఒకరు. ఆన్లైన్ పేజీ ద్వారా కుప్పలు తెప్పలు గా విరాళాలు వచ్చాయి అనుకున్న లక్ష్యం పూర్తై దాదాపు 17 వేల పౌండ్లను ఇప్పటిదాకా కలెక్ట్ చేయగలిగారు. కానీ అంత డబ్బు ఉన్నా ఇప్పటికైతే ఆ బాలుడి ప్రాణాన్ని కాపాడలేమంటూ చెప్పేసారు డాక్టర్లు...

English summary
The Hollywood actor made Marvel fan Daniel Downing's dream come true by calling him from the set of Deadpool 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu