»   » ఆ హీరోయిన్‌ అంటే పిచ్చి: 50 సర్జరీలకు తెగించిన అభిమాని, షాకింగ్ లుక్

ఆ హీరోయిన్‌ అంటే పిచ్చి: 50 సర్జరీలకు తెగించిన అభిమాని, షాకింగ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆ హీరోయిన్‌ అంటే పిచ్చి.. 50 సర్జరీలకు తెగించింది !

హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వయసులో ఉన్నపుడు ఏంజెలీనా అందం ప్రపంచ సినీ అభిమానులను కట్టిపడేసింది. ఆమె స్టైల్‌ ఫాలో అయినవారి లెక్క చెప్పడం కష్టమే.

ఏంజలీనా జోలీ అంటే తెగ ఇష్టపడే ఇరాన్‌కు చెందిన ఓ టీనేజర్ తన అభిమాన నటిలా మారాలనుకుంది. ఇందుకోసం ఏకంగా 50 సర్జరీలు చేసుకుంది. సర్జరీల తర్వాత ఆ అభిమాని ఎవరూ ఊహించని విధంగా తయారైంది.

 సహార్ టబర్ అసలు రూపం

సహార్ టబర్ అసలు రూపం

ఇరాన్‌కు చెందిన 19 ఏళ్ల సహార్ టబర్‌కు హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ అంటే పిచ్చి. ఆమెలా మారేందుకు ఏం చేయడానికైనా సిద్ధమైంది. ఇందుకోసం తన ముఖానికి, శరీరానికి సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది.

 దాదాపు 50 సర్జరీలు, కఠినమైన డైట్

దాదాపు 50 సర్జరీలు, కఠినమైన డైట్

తన అభిమాన తారలాగా మారేందుకు సహార్ టబర్ కొన్ని నెలల వ్యవధిలో దాదాపు 50 సర్జరీలు చేయించుకుందట. అంతేకాదు తన బరువు 40 కేజీలకు మించకుండా కఠినమైన డైట్ మెయింటేన్ చేసిందట.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

సర్జరీ తర్వాత తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సహార్ టబర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ఆ పోస్టుల తర్వాత ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

 సర్జరీలు ఎంత వరకు నిజమో?

సర్జరీలు ఎంత వరకు నిజమో?

అయితే సహార్ టబర్ 50 సర్జరీలు చేయించుకున్నట్లు అఫీషియల్ సమాచారం అయితే లేదు. కొందరు ఇది మేకప్ మాయ అని, ఫోటోషాప్ చేసి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.

 దెయ్యంలా ఉన్నావంటూ కామెంట్స్

దెయ్యంలా ఉన్నావంటూ కామెంట్స్

ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు నువ్వు ఏంజలీనా జోలీ మాదిరిగా అస్సలు మారలేదని, దెయ్యంలా కనిపిస్తున్నావని, అంద విహీనంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

English summary
A teenager from Iran has found herself in the spotlight after reports of her having undergone 50 surgeries to look like Angelina Jolie began doing the rounds.According to The Sun, 19-year-old Sahar Tabar considers herself to be one of Angelina's biggest fans and has said that she "would do anything" to look like her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu