»   »  ‘అవతార్’ హీరో సామ్ వర్తింగ్టన్ అరెస్ట్

‘అవతార్’ హీరో సామ్ వర్తింగ్టన్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Sam Worthington Arrested
న్యూయార్క్: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అవతార్' చిత్రంలో హీరోగా నటించిన సామ్ వర్తింగ్టన్‌ను పోలీసులు అరెస్టు చేసారు. ఓ ఫోటో గ్రాఫర్‌పై దాడి చేసిన సంఘటనలో ఆయన్ను పోలీసులు మాన్ హట్టన్‌లో అరెస్టు చేసారు. సామ్ వర్తింగ్టన్ అరెస్టయిన విషయం ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

37 ఏళ్ల సామ్ వర్తింగ్టన్ సెలబ్రిటీ వార్తలు కవర్ చేసే మీడియా ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సామ్ వర్తింగ్టన్ గర్ల్ ఫ్రెండ్, మోడల్ లారా బింగిల్‌ పట్ల సదరు ఫోటోగ్రాఫర్ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేయడంతో వర్తింగ్టన్ అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ వెస్ట్ విలేజ్‌లోని క్యూబీహోల్ బార్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

న్యూయార్కు పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి జాన్ గ్రింపిల్... సామ్ వర్తింగ్టన్ అరెస్టయిన విషయాన్ని దృవీకరించారు. ఫోటో గ్రాఫర్ లారాను కొట్టాడని, దీంతో వర్తింగ్టన్ అతనిపై దాడి చేసాడని చేసాడని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం వర్తింగ్టన్ బెయిల్‌పై విడుదలయినప్పటికీ బుధవారం అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

మరో వైపు లారాను కొట్టిన ఫోటోగ్రాఫర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసారు. అతనిపై కూడా కేసు నమోదు చేసారు.

English summary

 Avatar star Sam Worthington was arrested for assault in New York Sunday evening after allegedly punching a photographer in the face.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu