»   » ఆ సీన్ చెయ్యాలంటే మందు కొట్టాల్సిందే..!

ఆ సీన్ చెయ్యాలంటే మందు కొట్టాల్సిందే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ది బ్లైండ్ సైడ్ సినిమాలో ప్రదర్శించిన నటనతో అందరి మన్ననలూ పొంది, ఆస్కార్ కు నామినేట్ అయిన నటి సాండ్రా బుల్లక్. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె కొన్ని సన్నివేశాలు చెయ్యాలంటే మందు పడాల్సిందేనట. అదేంటా అనుకుంటున్నారా..? అయితే చదవండి. ఈ అమ్మాయిగారికి సినిమాల్లో శృంగార రసాన్ని పండించాలంటే తగని సిగ్గట. కెమెరా ముందు అందులోనూ అందరి ముందూ శృంగారాన్ని పండించాలంటే చాలా ఇబ్బందిగా వుంటుందట అందుకే ఇలాంటి సన్నివేశాలు చెయ్యడానికి దైర్ఘాన్ని కూడగట్టుకొనేందుకు ఆమె వైన్ తాగిమరీ నటించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెళ్లడించింది.

నగ్నంగా సన్నివేశాన్ని తీస్తుంటే ఎంతో భయపడ్డాను, కానీ ఆ తర్వాత దైర్ఘం తెచ్చుకోవడానికి వైన్ తాగి ఎలాగోలా ఆ సన్నివేశాన్ని పూర్తి చెయ్యగలిగాను అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఈ దఫా ఆస్కార్ అవార్డుల్లో ఖచ్చితంగా ఈమె విజేతగా నిలుస్తుందనే అంచనాలు వున్నాయి. మరి అవార్డు వస్తుందో రాదో అనే భయంతో అక్కడికి కూడా మందు కొట్టిపోతుందేమో..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu