»   » విధి ఆమెతో దారుణంగా ఆడుకున్నది

విధి ఆమెతో దారుణంగా ఆడుకున్నది

Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డు నటీమణి సాంద్రా బుల్లక్ భర్త జెస్సీ జేమ్స్ వేరొక అమ్మాయితో వివాహేతరసంబంధం పెట్టుకున్నాడని తెలిసి అతడి నుండీ దూరంగా వుంటోంది. అసలామె ఎక్కడుంతో కూడా సరైన సమాచారం లేదు. తన భర్త నుండీ దూరంగా వెళ్లిపోయిన ఆమె అప్పటి నుండీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

విధి ఎంతో విచిత్రమయినది అని చెప్పడానికి సాంద్రా ఓ చక్కటి ఉదాహరణ. దీనికోసం ఓ రెండు నెలల ముందు వెనక్కు వెళ్ధాం. గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ తన భార్యను మోసం చేసి 18 మందితో రాసలీలలు నెరిపిన సంగతి బయటడినప్పటి సమయంలో సాంద్రా బుల్లక్ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది. నేనే కనుక టైగర్ వుడ్స్ భార్య ఎలిన్ స్థానంలో వుండి వుంటే అతన్ని చితకొట్టేదాన్నని... కానీ ఎలిన్ చాలా ఓపికతో తిరిగి అతనితో జీవించడానికి ఒప్పుకుందని, ఆమెను అభినందించింది. కానీ నేనయితే అలా చెయ్యను బేస్ బాల్ బ్యాట్ తీసుకుని ఉతికిపడేస్తాను అని చెప్పింది.

విధి వక్రించింది. సాంద్రాకు కూడా ఇప్పుడు అదే గతి పట్టింది. తన భర్త తనని మోసం చెయ్యడంతో ఏమి చెయ్యాలో పాలుపోక అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కానీ మీడియాలో మాత్రం ఆమె విడాకుల కోసం లాయర్ ను వెతికే పనిలో వుందని.. లేదు ఆమె అతన్ని క్షమిస్తుందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విధి ఎంత చిత్రమయినదో కదా..!!

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu