»   » భర్తకు భయపడి కొండల్లో దాకున్న నాయిక

భర్తకు భయపడి కొండల్లో దాకున్న నాయిక

Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డు నటీమణి సాంద్రా బుల్లక్ ఇటీవల ఎక్కడా కనిపించకుండా పోయింది. తను నటించిన బ్లైండ్ సైడ్ చిత్రం ప్రచారానికి కూడా దూరంగా వుంటోంది. దీనికి కారణం ఆమె భర్త జెస్సీ జేమ్స్. ఇతగాడు చేసిన మోసానికి తీవ్రమానసిక వేదనకు గురయిన ఈమె ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడటం లేదట. తను ప్రస్తుతం భర్తతో కలసి వుంటున్న ఇంటి నుండీ వెళ్లిపోయిన సాంద్రా బుల్లక్ పెళ్లికాక ముందు హాలీవుడ్ హిల్స్ లో తను నివాసమున్న ఇంటికి వెళ్లిపోయిందట. ఇక్కడికి తనకు అత్యంత సన్నిహితులను తప్ప మరెవ్వరినీ అనుమతించడం లేదట.

తను ఇక్కడ వుంటున్న విషయాన్ని ఈమె అత్యంత గోప్యంగా వుంచిందట. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుడు ఒకరు బయటపెట్టారట. ఇక తను జెస్సీ కు విడాకులు ఇవ్వనుంది అని వస్తున్న వార్తల్లో నిజం లేదని అతను పేర్కొనడం గమనార్హం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu