»   » విడాకుల కోసం కోర్టుకెక్కనున్న ప్రముఖ తార..!!

విడాకుల కోసం కోర్టుకెక్కనున్న ప్రముఖ తార..!!

Subscribe to Filmibeat Telugu

ఇటీవలే ఆస్కార్ అవార్డు గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తార సాంద్రా బుల్లక్. సాంద్రా తనకు అవార్డు తెచ్చిపెట్టిన బ్లైండ్ సైడ్ సినిమా షూటింగులో బిగా వుండగా ఆమె భర్త మరో మోడల్ తో రాసలీలలు నడుపుతూ బిజీగా వున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే అమెరికాకు చెందిన ఓ పత్రిక బయటపెట్టింది. దీంతో ఆగ్రహం చెందిన సాంద్రా తన నుండీ దూరంగా మరో ఇంట్లోకి మారిపోయింది.

ఇదిలా వుంటే ఆమె భర్త మీడియా ముఖంగా తన తప్పును ఒప్పుకొని తనని క్షమించమని సాంద్రాని వేడుకున్నాడు. దీంతో ఆమె అతన్ని క్షమించాలా లేక శిక్షించాలా అని ఇన్నాళ్లు ఆలోచించిన సాంద్రా చివరికి అతనికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుందట. ఈ విషయమై ఆమె లాయర్ ను సంప్రదించిందని సమాచారం. ఇదిలా వుంటే ఆమె ఆస్కార్ అవార్డు శాపానికి గురయిందని.. ఈ అవార్డు గెలుచుకున్న అందరు తారల్లాగే ఈమె కూడా విడాకులు తీసుకుంటోందని హాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu