twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ బాక్సాఫీసును కదిపేస్తున్న ఫుట్ బాల్ ప్లేయర్

    By Kuladeep
    |

    ఈ వారం హాలీవుడ్ ప్రముఖ నటి సాండ్రా బుల్లక్ నటించిన 'ది బ్లైండ్ సైడ్' సినిమా ఈ వారం హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ వారం 20.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా ఈ ఘనతను సాధించింది. ప్రముఖ అమెరికా ఫుట్ బాల్ ప్లేయర్ మైఖేల్ ఓహర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.

    గత రెండు వారాల పాటు టాప్ ప్లేస్ లో కొనసాగిన న్యూ మూన్ సినిమా ఈ వారం రెండవ స్థానానికి పడిపోయింది. ఈ సినిమా 15.7 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ స్థానంలో నిలిచింది. ఇటీవలే విడుదలయిన బ్రదర్స్ సినిమా 9.7 మిలియన్ డాలర్లు వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. డిస్నీ వారి ఎ క్రిస్ట్ మస్ కరోల్ సినిమా 7.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాల్గవ స్థానంలో నిలిచింది.

    గత రెండు వారాల్లో మూడు, నాల్గవ స్థానాల్లో నిలుస్తూ వస్తున్న 2012 సినిమా ఈ వారం రెండు స్థానాలు దిగజారి ఆర్మోరెడ్ సినిమాతో కలసి సంయుక్తంగా ఆరవ స్థానంలో నిలిచింది. సాంకేతికంగా ఎంతో గొప్పగా వున్న ఈ సినిమాకు వీక్ స్క్రీన్ ప్లే శాపంగా పరిణమించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    కాగా ఈ వారం బాక్సాఫీస్ వద్ద తొలి పదిస్థానాల్లో నిలిచిన సినిమా వివరాలు ఈ విధంగా వున్నాయి:

    1. ది బ్లైండ్ సైడ్ ---- 20.4 మిలియన్ డాలర్లు
    2. న్యూ మూన్ ---- 15.7 మిలియన్ డాలర్లు
    3. బ్రదర్స్ ---- 9.7 మిలియన్ డాలర్లు
    4. ఎ క్రిస్ట్ మస్ కరోల్ ---- 7.5 మిలియన్ డాలర్లు
    5. ఓల్డ్ డాగ్స్ ---- 6.9 మిలియన్ డాలర్లు
    6. ఆర్మోరెడ్ ---- 6.6 మిలియన్ డాలర్లు
    6. 2012 ---- 6.6 మిలియన్ డాలర్లు
    8. నింజా అస్సాస్సిన్ ---- 5.0 మిలియన్ డాలర్లు
    9. ప్లానెట్ 51 ---- 4.3 మిలియన్ డాలర్లు
    10. ఎవరీ బడీ ఈజ్ నాట్ ఫైన్ ---- 4 మిలియన్ డాలర్లు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X