»   » ఆమె ఉత్తమ నటా.? చెత్త నటా..?? లేక రెండూనా..!?

ఆమె ఉత్తమ నటా.? చెత్త నటా..?? లేక రెండూనా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాండ్రా బుల్లక్... ఇప్పుడు హాలీవుడ్ లో ఎవ్వరినోట విన్నా వినిపిస్తున్న పేరు. ది బ్లైండ్ సైడ్ సినిమాలో ఉత్తమనటన కనబరిచి గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఈ ఏడాది ఆస్కార్ ఈమెకే లభించే అవకాశాలు ఎక్కువగా వున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఈమె ఆల్ అబౌట్ స్టీవ్ చిత్రంలో కనబరిచిన చెత్త నటనకు గాను ది గోల్డెన్ ర్యాస్బెరీ వారిచ్చే ఈ ఏటి చెత్తవీరుల అవార్డుల్లో కూడా నామినేషన్ దక్కించుకుందీ వీరనారీమణి. మరి ఈ అవార్ఢుల్లో కూడా ఈమెకే అవార్డు వచ్చేంతటి చెత్తగా నటించిదీవిడ ఈ సినిమాలో. మరి అదృష్టం బాగుండి అస్కార్, దురదృష్టావశాత్తు ది గోల్డెన్ ర్యాస్బెరీ అవార్డు కానీ వస్తే ఈమె ఉత్తమ నటిగా, చెత్త నటిగా ఒకే సారి అవార్డు అందుకున్న నటిగా రికార్డు సృష్టించనుంది.

మరిప్పుడు ఈమె ఉత్తమ నటా.? చెత్త నటా..?? లేక రెండూనా..!? అంటే మాత్రం సమాధానం కోసం మార్చి 7వ తేదీ వరకూ ఆగాల్సిందే మరి..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu