భర్తతో ఆమె రొమాన్స్ భరించలేకనే.. లండన్‌కు
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జోహాన్సన్ లండన్‌లో కొత్త ఆస్తిని కొనాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 27 సంవత్సరాల వయసు కలిగిన స్కార్లెట్ జోహాన్సన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తన మాజీ భర్త రేయన్ రేనాల్డ్స్ , అతని గర్ల్ ప్రెండ్ బ్లేక్ లైవిలీ మద్య జరుగుతున్న రోమాన్స్ తాను వినడానికి ఇష్టం లేకనే న్యూయార్క్ నుండి వెళ్లి పోవాలనే ఉద్దేశ్యంతో లండన్‌లో స్దిరపడాలని అనుకున్నట్లు హాలీవుడ్ వర్గాల భోగట్టా.
ఈ సందర్బంలో స్కార్లెట్ జోహాన్సన్ సన్నిహితుడు మాట్లాడుతూ స్కార్లెట్, రేయన్ రేనాల్డ్స్ ఉన్న చోట కొంచెం ఇబ్బిందిగా ఫీల్ అవడమే కాకుండా.. ఇటీవల కాలంలో రేయన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవిలీ ఇద్దరి రొమాన్స్ పెళ్లి వరకు వెళ్లిందనే వార్తలు వినిపించడంతో ఇలాంటి వాటి నుండి దూరంగా వెళ్లేందుకు నిశ్చయించుకోని స్కార్లెట్ జోహాన్సన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
న్యూయార్క్‌లో స్కార్లెట్ జోహాన్సన్ ఉన్నప్పడు తన ప్రొపైల్‌ని తక్కువగా మెయింటేన్ చేస్తుంది. ఆమె మొత్తం పార్టీ సన్నివేశం మిస్ అవ్వాలని కోరుకుంటుంది. ఆమె ప్రస్తుతం 'అండర్ ద స్కిన్ ఇన్ స్కాట్లాండ్' అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్బంలో తన జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీని కోసం ఆమె ఎవరినైనా కొత్తగా కలిసే అవకాశం ఉంది. దీనిని బట్టి అర్దం అయిందేమిటంటే లండన్‌లో ఉన్న బ్రిటిష్ పురుషునితో లవ్‌లో పడిందన్నమాట.


Click it and Unblock the Notifications











