»   » సినిమా సెట్లో సిగరెట్ కాలుస్తూ హీరోయిన్

సినిమా సెట్లో సిగరెట్ కాలుస్తూ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: సెలీనా గోమెజ్ మనకు ఇప్పటి వరకు కేవలం అమెరికన్ కుర్ర పాప్ స్టార్‌గా‌, జస్టిన్ బీబర్ మాజీ ప్రేయసిగా మాత్రమే తెలుసు. త్వరలో ఆమెను ‘ది రివైజ్డ్ ఫండమెంటల్ ఆఫ్ కారెగివింగ్' అనే హాలీవుడ్ చిత్రంలో హీరోయిన్‌గా చూడబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఆమె పాల్ రుడ్‌కు జతగా నటిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయకు వచ్చింది. సెట్లో సెలీనా సిగరెట్ కాలుస్తూ కనిపించింది. అయితే ఇది సినిమా షూటింగుకు సంబంధించిన స్టిల్ తెలుస్తోంది. గ్యాస్ స్టేషన్లో సిగరెట్ కాలుస్తున్నట్లు ఉన్న ఈ లుక్ చాలా అందంగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Selena Gomez Smokes A Cigarette On The Sets

జోనాథన్ ఇవిసన్ రచించిన నవల ఆధారంగా...అదే పేరుతో దర్శకడు రోబ్ బర్నెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రంలో పాల్ రుడ్ హీరోగా నటిస్తుండగా...అతనికి జతగా సెలీనా గోమెజ్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని డోన్నా గిగ్లియోట్టి, జేమ్స్ స్పైస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

English summary
Selena Gomez is all set and the cameras started rolling as well. The Revised Fundamentals of Caregiving shoot has started in Atlanta, Georgia. A few weeks after it was confirmed that Selena Gomez is going to star in the movie opposite Paul Rudd.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu