»   » ఆ అందగత్తేతో డాన్స్ చేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు..!

ఆ అందగత్తేతో డాన్స్ చేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రా షకీరా అంటూ మన తెలుగులో మహానుభావులు పాటలు రాశారంటే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోండి. అంతేకాకుండా తన పాటలతో యూవత్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. అభిమానుల కోసం తారాగణం ఏమైనా చేస్తుంటారు. అలాంటి వాటిల్లో భాగంగా పాప్ సింగర్ షకీరా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఫ్రోగ్రాం ఏంటంటే త్వరలో తాను చేయబోయే నార్త్ అమెరికా టూర్ లో తన అభిమానులు కూడా స్టేజి పై తనతో డాన్స్ వేసే అవకాశం కల్పించాలని తన సోంత వెబ్ సైట్ లో ఫ్యాన్స్ కి అవకాశం కల్పించింది.

ది హిప్స్ డోన్ట్ లై సింగర్ త్వరలో తాను చేపట్టబోయే ఈ వినూత్నకార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అమె అనుకుంటున్నారు. పోయిన సారి కెనడాలో జరిగినటువంటి షోలో షకీరా అభిమానులుకు బాగా దగ్గరవ్వడం దానితో పాటు అభిమానుల మనసుల కూడా దోచుకోవాలని ఈ ప్లాన్ వేసినట్టు అన్నారు. వెబ్ సైట్ లో పేర్లు నమోదుచేసుకున్న అభిమానులలో నుంచి ఇద్దరు అభిమానులకు స్టేజిపై తనతో డాన్స్ వేసే అవకాశం కల్పిస్తానని అన్నారు. దీనితో నార్త్ అమెరికా లోని మ్యూజిక్ అభిమానులలో ఆనందం వెల్లువిరిసింది. మొత్తానికి కెనడా మరియు నార్త్ అమెరికా లో ని షకీరా అభిమానులు ఈ ఈవెంట్స్ ని చాలా గ్రాండ్ గా జరపాలని నిర్ణయించుకున్నట్లు తలిపారు. అంతేకాకుండా తమ డాన్సింగ్ క్వీన్ తో డాన్స్ వేయడానికి తాము రెడీగా ఉన్నామంటూ అన్నారు.

షకీరా పాటలకే చెవులు కోసుకునే జనం, ఇక ఆమెతో కలసి స్టేజి పై డాన్స్ చేసే అవకాశం కల్పించిందంటే ఇంక ఈ అభిమానులు ఎలా రెచ్చిపోతారో మనం ఊహించుకోవాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu